ముంచిన ముసురు!

ABN , First Publish Date - 2021-07-24T07:07:09+05:30 IST

ప్రకృతి వైఫరీత్యాలను తట్టుకొని పంట సాగు చే స్తున్న రైతుకు ఎడతెరిపి లేకుండా కురిసిన వరం ఆగం జేసింది.

ముంచిన ముసురు!
కామారెడ్డి జిల్లాలో పంట చేనులో నీరు నిలిచిన దృశ్యం


చెరువులను తలపిస్తున్న చేన్లు
8 మండలాల్లో దెబ్బతిన్న పంటలు
సుమారు 18 వేల 397
ఎకరాలలో పంట నష్టం
ఆందోళనలో రెండు వేల మంది రైతులు


కామారెడ్డి,జూలై 23 (ఆంధ్ర జ్యోతి): ప్రకృతి వైఫరీత్యాలను తట్టుకొని పంట సాగు చే స్తున్న రైతుకు ఎడతెరిపి లేకుండా కురిసిన వరం ఆగం జేసింది. జి ల్లాలోని పలు మండలాల్లో వరితో పాటు ఆరుతడి పంటల కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీం తో పంటలను ఎలా కాపాడుకునేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జి ల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు సైతం జోరుగా సాగుతోంది. జిల్లా లో ఈ వానాకాలం సీజన్‌లో అధికారులు నిర్దేశించిన లక్ష్యానికి తగ్గుట్టుగా వివిధ పంటలను రైతులు విస్తారం గానే సాగుచేశారు. వరితో పాటు ఆరుతడి పంటలను అన్నదాతలు విస్తరంగా సాగు చేస్తుంటారు. రెండు లక్షల ఎకరాలలో వరి పంట సాగవుతుండగా మిగతా రెండున్నర లక్షల ఎకరాలలో పత్తి, సోయా, మొక్కజొన్న, అపారాలను సాగవుతున్నాయంటే ఆరుతడి పంటలను రైతులు ఏ స్థాయిలో వేస్తుంటారో అర్థమవుతుంది. జి ల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,90,779 ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 1,87,000 ఎకరాలలో సాగయింది. మొక్కజొన్న 59 వేల ఎకరాలలో, సోయాబిన్‌ 67 వేల ఎక రాలలో,పత్తి 34 వేల ఎకరాలలో, కందు లు 17 వేల ఎకరాలలో, మినుములు 5500 ఎకరాలలో, పెసర్లు 8 వేల 700 ఎకరాలలో, చెరుకు 4600 ఎకరాలలో పంటలు సాగయ్యాయి.
18 వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్న పంటలు
జిల్లాలోని భారీ వర్షాలకు 18 వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ క్షేత్రపరిశీలనలో తేలింది. జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 44 గ్రామాల్లో 2240 మంది రైతులకు సంబంధించి 18,397 ఎకరాలలో వివిధ పంటలు నీటమునిగాయి. ఇందులో వరి 1842 ఎకరాలలో, మొక్కజొన్న 22 ఎకరాలలో, పత్తి 837, ఎకరాలలో, కందులు 1110 ఎకరాలలో, పెసర్లు 1638 ఎకరాలలో, సోయాబీన్‌ 11635 ఎకరాలలో, మినుములు 1313 ఎకరాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖధికారుల పరిశీలనలో తేలింది. మద్నూర్‌లో 556 మంది రైతులకు సంబంధించి 5816 ఎకరాల్లో, బిచ్కుందలో 725 మంది రైతులకు సంబంధించి 586 ఎకరాలలో, జుక్కల్‌లో 489 మంది రైతులకు సంబంధించి 6296 ఎకరాల్లో, నస్రుల్లాబాద్‌లో 98 మంది రైతులకు సంబంధించి 219 ఎకరాలలో, బాన్సువాడలో 16 మంది రైతులకు సంబంధించి 40 ఎకరాలలో, బీర్కూర్‌లో 329 మంది రైతులకు సంబంధించి 850 ఎకరాలలో, గాంధారిలో 18 మంది రైతులకు సంబంధించి 52 ఎకరాలలో, తాడ్వాయిలో 12 మంది రైతులకు సంబంధించి 38 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి.
నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు
జిల్లాలో అన్నదాతలు ఆరుతడి పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, కందులు, మినుములు, పెసర పంటలను విస్తారంగా సాగుచేస్తుంటారు. నీటి వనరులు తక్కువగా ఉండడంతో వర్షాలపై ఆధారపడి ప్రతిఏటా ఈ పంటలను లక్షల ఎకరాలలోనే వేస్తుంటారు. ప్రధానంగా మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట, నస్రుల్లాబాద్‌ తదితర మండలాల్లో ఈ పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. అయితే ఈ ఏడాది నకిలీ విత్తనాలైన సోయా, పత్తి రైతులను నట్టేట ముంచాయి. ఈ సారి ప్రభుత్వం సోయా విత్తనాలు సరాఫరా చేయకపోవడంతో రైతులు పక్కరాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేయడం డీలర్ల వద్ద తెచ్చుకోవడంతో నాణ్యత లేకపోవడం వల్ల ఆ విత్తనాలు మొలకెత్తలేదు. ఇలా జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలలో సోయా మొలకెత్తలేదని రైతులు చెబుతున్నారు. ఇక ప్రైవేట్‌ కంపెనీలు మార్కెట్‌లో సరాఫరా చేసే పత్తి విత్తనాల సంగతి చెప్ప నవసరం లేదు. వేల ఖర్చు చేసి పత్తి విత్తనాలు కొనుగోలు చేయగా వాటిని విత్తేందుకు, సాగు చేసేందుకు రైతులు తీవ్రంగా ఖర్చు చేస్తుంటారు. అవి సైతం మొలకెత్తక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలా మొదట్లోనే నకిలీ విత్తనాలు అన్నదాతలను ముంచగా, భారీ వర్షాలు మొలకెత్తిన పంటలను ముంచెత్తాయి.
దెబ్బతిన్న ఆరుతడి పంటలు
జిల్లాలో వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా ముసురుకమ్మేసింది. జిల్లా అంతటా విస్తరంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు భారీ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరో వైపు ఈ ముసురు ఆరుతడి పంటల రైతులకు మాత్రం నష్టం చేకురుస్తోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పత్తి, సోయా, మొక్కజొన్న, మినుము, పెసర, కంది లాం టి ఆరుతడి పంటలను రైతులు విస్తరంగా సాగుచేశారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఆరుతడిపంటల చేనుల లో భారీగా వరదనీరు నిలిచింది. ఇప్పుడిప్పుడే మొలకె త్తుతున్న ఆరుతడి పంటలు నీటి మునగడంతో నష్టం నెలకొననుంది. బిచ్కుంద, పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట మండలా ల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా చెరువులు అలుగు పోస్తున్నాయి. ఈ వరద స్థానికంగా ఉన్న పంట పొలాలు, చేన్లలోకి చేరుతుండడం, వర్షపు నీరు నిలుస్తుండడంతో ఆరుతడి పంటలు నీటి మునిగి పోయ్యాయి. ప్రధానంగా పత్తి, సోూ, పప్పుదినుసు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-07-24T07:07:09+05:30 IST