డిప్యూటీ స్పీకర్‌ విస్తృత పర్యటన

ABN , First Publish Date - 2021-03-02T07:05:14+05:30 IST

మండలంలో సోమవారం డిప్యూటీ స్పీకర్‌ కో నా రఘుపతి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబుతో కలసి విస్తృతంగా పర్యటించారు.

డిప్యూటీ స్పీకర్‌ విస్తృత పర్యటన


 పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

పర్చూరు, మార్చి 1 : మండలంలో సోమవారం డిప్యూటీ స్పీకర్‌ కో నా రఘుపతి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబుతో కలసి విస్తృతంగా పర్యటించారు. మండలంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, శంకుస్థాపనలు నిర్వహించారు. చెరుకూరు - అడుసుమల్లి రహదారి నిర్మాణానికి తొలుత శం కుస్థాపన చేశారు. అనంతరం చెరుకూరు తివిక్రమ అగస్థేశ్వర దేవాలయాల్లో చేసిన పూజలో పాల్గొన్నారు. తొలుత ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదపండితులు, మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉప్పుటూరు గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి చరిత్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే గ్రామంలోని ఎస్సీకాలనీలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీరోడ్డును స్పీకర్‌ ప్రారంభించారు. కార్యక్రమం లో ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, దేవదాయ డిప్యూటీ కమిషనర్‌ జి.మాధవి, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొల్లా సుభా్‌షబాబు, మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు, కోటా హరిప్రసాద్‌, భవనం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ యర్రాకుల తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు. 

రైతులకు అండగా వైసీపీ

రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలిచిందని, అందులో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించటమే ఇందుకు నిదర్శనమని డిప్యూటీ స్పీకర్‌ రఘుపతి చెప్పారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లా అంజమ్మ, మార్టెట్‌ యార్డు కార్యదర్శి ప్రసన్నకుమారి, జక్కిరెడ్డి సుబ్బాయమ్మ,  హరిప్రసాద్‌, కుక్కపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

ఇంకొల్లు అభివృద్ధికి సహకరిస్తా 

ఇంకొల్లు : నియోజకవర్గంలోని ఇంకొల్లు ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం నూతనంగా ఎన్నికైన ఇంకొల్లు సర్పంచ్‌ ఏజర్ల ప్రసన్న అభినందన సభలో ఆయన పాల్గొన్నారు.  ఇంకొల్లు, వంకాయలపాడు, భీమవరం గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి రామనాఽథంబాబు, భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకట్రావు, మండల పార్టీ కన్వీనర్‌ బండారు ప్రభాకరరావు, బండ్ల సుబ్బారావు, సైమన్‌బాబు, మద్దినేని హనుమందరావు, రావి పేరయ్య,వార్డు సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T07:05:14+05:30 IST