డైరెక్టు బిజినెస్‌

Nov 29 2021 @ 00:01AM

ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న పీఏసీఎస్‌ డైరెక్టర్లు
శాయంపేట సొసైటీలో నిబంధనలు బేఖాతరు
గత రబీలో రూ.11కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
సొసైటీకి రావలసిన కమీషన్‌కు గండి
సహకార శాఖ అధికారులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు


హనుమకొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
హనుమకొండ జిల్లా శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సొసైటీ పనితీరుపై రై తుల నుంచి జిల్లా సహకార శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. గత రబీ సీజన్‌లో ఈ సొసైటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ప్ర స్తుతం ఈ సీజన్‌లో కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోం ది. గత రబీ సీజన్‌లో కొందరు డైరెక్టర్లు ధాన్యం కొనుగోళ్లు జరపడంవల్ల సొసైటీకి రావలసిన కమీషన్‌కు గండిపడినట్టు తెలిసింది. పైగా నిర్వహణ ఖర్చులను భారీగా చూ పించి పెద్ద మొత్తంలో దండుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. సొసైటీ బాధ్యులు ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

డైరెక్లర్లే వ్యాపారులు

శాయంపేట పీఏసీఎ్‌సలో గత రబీసీజన్‌లో ధాన్యం కొ నుగోళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు డైరెక్టర్లు నిర్వహించారు. ఈ మేరకు సొసైటీతో అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకున్నారు. ఈ సొసైటీ పరిధిలో మొత్తం 24గ్రామాలుండగా మైలారం, ప్రగతి సింగారం, జో గంపల్లి, నేరేడుపల్లి, తహరాంపూర్‌ గ్రామాల్లో డైరెక్టర్లు సుమా రు రూ.11కోట్ల విలువైన ఆరువేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందువల్ల మెట్రిక్‌ టన్నుకు రూ.32 చొప్పున సొసైటీకి రావలసిన రూ.18లక్షల కమీషన్‌ రాకుండాపోయింది. ఈ బాగోతం ఇంతటితో పూర్తికాలేదు. ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చుల కింద పెద్దమొత్తం కాజేసేందుకు బిల్లులను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ బిల్లుల చెల్లింపు కోసం డైరెక్టర్లు సహకార శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ సీజన్‌లో కూడా ధాన్యాన్ని డైరెక్టర్లే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఉద్యోగులకు వేధింపులు

ధాన్యం కొనుగోలుకు అవసరమైన సరంజామాను సొసైటీ బాధ్యుల్లో కొందరు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగు లు చేయాల్సిన పనులను కూడా వారే చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సివిల్‌ సప్లయ్‌ ఆఫీసుకు వెళ్లాల న్నా, పరకాలకు వెళ్లి కాంటాలు తేవాలన్నా ఉద్యోగులను కాదని వారే వెళుతున్నారు. ఇదేమిటని అడిగినందుకు త మను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లను సొసైటీ డైరెక్టర్లు పర్యవేక్షించాలనే కానీ, ఇన్‌చార్జీలుగా వ్యవహరించరాదని జిల్లా సహకార శాఖాధికారులు స్పష్టత ఇవ్వడంతో కొంత మంది డైరెక్టర్లలో ఆసహనం పెరిగి ఉద్యోగులను దుర్భాషలాడుతున్నట్టు తెలుస్తోంది. దీనితో ఉద్యోగులు ఈ సొసైటీ పరిధిలో పని చేయలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌చార్జి సీఈవోనే దిక్కు
సుమారు 9వేల మంది సభ్యులున్న శాయంపేట పీఏసీఎ్‌సకు పూర్తిస్థాయి సీఈవో లేడు. గతంలో పని చేసిన సీఈవోపై ఆరోపణలు రావడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన సస్పెన్షన్‌ వెనుక కొందరు డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సస్పెండ్‌ అయిన సీఈవోపై ఆరు నెలలుగా విచారణ జరుగుతున్నా ఇప్పటివరకు నివేదిక ఇవ్వకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పెంచికల్‌పేట సీఈవో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ సీఈవో లేకపోవడంవల్ల పర్యవేక్షణ కరువైంది. సొసైటీ సమర్ధవంతంగా పనిచేయడానికి రెగ్యులర్‌ సీఈవోను నియమించాలని, ఽగత రబీసీజన్‌లో జరిగిన ధాన్యం కోనుగోళ్ల వ్యవహారంపై విచారణ జరపాలని, అవతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

నిబంధనలు

సహకార చట్టం నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లను సొసైటీయే స్వయంగా నిర్వహించాలి. సొసైటీ పక్షాన అందులో పనిచేసే ఉద్యోగులే ధాన్యం కొనుగోలు వ్యవహారాలను చూస్తారు. తద్వారా వచ్చే ఆదాయం ఆ సొసైటీ ఖాతాలో జమఅవుతుంది. లాభం సొసైటీ సభ్యులకు చెందుతుంది. దీనికితోడు సొసైటీ పనితీరుపై సహకారశాఖ నుంచి మంచిమార్కులు  పడతాయి. ఫలితంగా కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. డైరెక్టర్లే వ్యాపారం చేస్తే ప్రభుత్వ పరంగా సొసైటీకి దక్కాల్సిన ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

ఆరోపణల్లో నిజం లేదు..
- కుసుమ శరత్‌, శాయంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌

గత రబీ సీజన్‌లో ఽనిబంధనలకు విరుద్ధంగా కొందరు డైరెక్టర్లు ధాన్యం కొనుగోళ్లు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. గత సీజన్‌లో కరోనా దృష్ట్యా కొనుగోళ్లు సాఫీగా జరిగేట్టు చూడడానికి డైరెక్టర్లు తమ వంతు సహకారాన్ని అందించారు. కొనుగోళ్ల ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులను వేధించడం అంటూ ఏమీ లేదు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. సొసైటీ కార్యాకలాపాలు పారదర్శకంగా సాగుతున్నాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.