రికార్డులను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
బికోడూరు, మే 21 : మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో క్షయ వ్యాధి గ్రస్థులను వైద్యప్రత్యక్ష పర్యవేక్షణ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి వైద్యాధికారి డానియల్ ఫ్రాంక్లిన్ శనివారం మండల వైద్యాధికారులు వర్దన్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పరీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ వ్యాధి గ్రస్థులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. మంచి ఆహార అలవాట్లు పాటిస్తే వ్యాధి నయం అవుతుందని వారు తెలిపారు. అలాగే పీహెచ్సీలో ఉన్న టీబీ మందులు, లేబరేటరీ, టీబీ కార్డ్స్‌ను వారు పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నాగేంద్రకుమార్, నరసింహాప్రసాద్, భారతి, బ్రహ్మారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, విస్తరణాధికారులు నరసింహారెడ్డి, రఘురామ్, జాన్ విలియమ్, తదితరులు పాల్గొన్నారు.