ఆపద సమయాల్లో దిశ యాప్‌ మహిళలకు రక్ష

ABN , First Publish Date - 2021-07-27T04:42:28+05:30 IST

మహిళలు ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉన్న సమయంలో దిశ యాప్‌ వారికి శ్రీరామరక్షగా ఉంటుందని ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే వారికి భద్రత ఉంటుందని కడప అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ అన్నారు.

ఆపద సమయాల్లో దిశ యాప్‌ మహిళలకు రక్ష
మాట్లాడుతున్న అర్బన్‌ సీఐ ఆలీ

అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ

కడప (క్రైం), జూలై 26 : మహిళలు ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉన్న సమయంలో దిశ యాప్‌ వారికి శ్రీరామరక్షగా ఉంటుందని ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే వారికి భద్రత ఉంటుందని కడప అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ అన్నారు. కడప నగరం నకా్‌షలోని వార్డు సచివాలయంలో సోమవారం మహిళా మిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మహిళలు ఒంటరిగా వెళ్లినా ఎవరైనా ఇతరులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఈ యాప్‌ ద్వారా క్షణాల్లో పోలీసులు వారి వద్దకు వచ్చి వారికి అండగా నిలబడతారన్నారు. అలాగే ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, వారికి పోలీసుశాఖ రక్షణగా ఉంటుందన్నారు. ఇప్పటికే మహిళలు, యువకులు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, ప్రతి మహిళ కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు అందించడంతో పాటు మహిళా పోలీసు కార్యదర్శులు, మహిళా మిత్రలు, వలంటీర్లు, మహిళలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో టూటౌన్‌ ఎస్‌ఐ రాఘవేంద్రరెడ్డి, కార్పోరేటరు షంషీర్‌, మహిళా మిత్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:42:28+05:30 IST