మహిళల రక్షణకు ‘దిశ’ దోహదం

ABN , First Publish Date - 2021-07-24T05:10:45+05:30 IST

‘దిశ’ చట్టం, దిశ యాప్‌ మహిళలకు రక్షణగా నిలుస్తాయని రాజాం టౌన్‌, రూరల్‌ సీఐలు పి.శ్రీనివాసరావు, డి.నవీన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని గంటా నారాయణరావు కళాశాల, డోలపేట ఎస్‌ఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాలల్లో వేర్వేరుగా ‘దిశ’పై విద్యార్థినులకు అవగాహన కలిగించారు.

మహిళల రక్షణకు ‘దిశ’ దోహదం

రాజాం రూరల్‌, జూలై 23:  ‘దిశ’ చట్టం, దిశ యాప్‌ మహిళలకు రక్షణగా నిలుస్తాయని రాజాం టౌన్‌, రూరల్‌ సీఐలు పి.శ్రీనివాసరావు, డి.నవీన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని గంటా నారాయణరావు కళాశాల, డోలపేట ఎస్‌ఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాలల్లో  వేర్వేరుగా ‘దిశ’పై విద్యార్థినులకు అవగాహన కలిగించారు. దిశ యాప్‌ను అందరు మహిళలు తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్‌ ను ఉపయోగించడం ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో  ప్రిన్సి పాల్‌ జగన్మోహనరావు,  సంతకవిటి ఎస్‌ఐ  జనార్దనరావు పాల్గొన్నారు. 


అవగాహన అవసరం

రేగిడి: ఆపద సమయంలో మహిళలకు రక్షణగా నిలిచే దిశ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు కోరారు. ఈ మేరకు ఉంగరాడమెట్ట కూడలి వద్ద మహిళలకు అవగాహన కలిగించి యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేయించారు. ఆపత్కాలంలో దీనిని ఎలా ఉపయోగించేది వివరించారు.

 

Updated Date - 2021-07-24T05:10:45+05:30 IST