K.Raghavendrarao : ‘వాంటెడ్ పండుగాడ్’ ను ఎంజాయ్ చేస్తారు అంటున్న దర్శకేంద్రుడు

Published: Mon, 15 Aug 2022 13:54:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
K.Raghavendrarao : వాంటెడ్ పండుగాడ్ ను ఎంజాయ్ చేస్తారు అంటున్న దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు (K.Raghavendra rao) స‌మ‌ర్పణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధ‌ర్ సీపాన (Sridhar Seepana) ద‌ర్శక‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ (Wanted Pandugad). ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బిగ్ టికెట్ లాంఛ్ చేశారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశమంతా ఆనందంగా ఉంది. సినిమాల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చింది. సీతారామం, బింబిసార‌, కార్తికేయ 2 వంటి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. రేపు థియేట‌ర్స్‌లో మ‌న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ రిలీజ్ అవుతుంది. నా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్, డైరెక్టర్ శ్రీధర్ సీపాన సహా ప్రతి ఒక టెక్నీషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు ఎంతగానో కో ఆపరేట్ చేశారు. ఎంట‌ర్‌టైనింగ్ మూవీగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఆగస్ట్ 19న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

సునీల్ (Sunil) మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారి సినిమాల్లో పళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే పండుంది. సాధార‌ణంగా దేవుడు (గాడ్‌) ద‌గ్గర‌కి ప‌ళ్లు తీసుకెళ‌తాం క‌దా.. అందుకే పండు, గాడ్ అని రెండింటినీ టైటిల్‌లో పెట్టాం. ఇప్పటి సినిమాల్లో క‌మెడియ‌న్స్ న‌టిస్తున్న వారందరం ఇందులో న‌టించాం. నేను కూడా చాలా కీల‌క‌మైన పాత్రలో న‌టించాను. మాతో పాటు నా త‌మ్ముడు.. శ్రీధ‌ర్  సీపాన‌కు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా చాలా మంచి పేరు తీసుకు రావాల‌ని కోరుకుంటున్నాను.నిర్మాత‌ల‌కు ఈ సినిమా చాలా ఎక్కువ‌గా డ‌బ్బులు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను’’  అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనసూయ, సుడిగాలి సుధీర్, దర్శకుడు శ్రీధర్ సీపాన, డైరెక్టర్ హరీశ్ శంకర్, తనికెళ్ళభరణి, పృధ్వి, శ్రీనివాసరెడ్డి, హీరో రోషన్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపి.. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International