Director ఎస్వీ కృష్ణారెడ్డికి జరిమానా

ABN , First Publish Date - 2022-05-04T16:19:32+05:30 IST

కారుకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వాడకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి

Director ఎస్వీ కృష్ణారెడ్డికి జరిమానా

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: కారుకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వాడకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.200 ఫైన్‌ విధించారు.  ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 05 బీవీ 0666 బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ ఉండడంతో కారును నిలిపారు. అందులో నుంచి దిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వాడనందుకు రూ. 200 ఫైన్‌ విధించారు. ఈ సందర్భంగా మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను కృష్ణారెడ్డి అభినందించారు. 

Read more