''జంతువులకు బోర్ కొట్టదు. వాటికి బోర్డమ్ అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడూ నేచర్ని చూస్తూ కూర్చుంటాయ్. లేదా తింటూ ఉంటాయ్. గంటల తరబడి గేదెలు గడ్డి నములుతూనే ఉంటాయ్. ఎందుకురా గేదెలాగా ఎప్పుడూ తింటుంటావ్.. అంటుంటారు. గేదెలకు కుకింగ్ రాదు కాబట్టి.. రోజూ 10 గంటలు చుయింగ్కే సరిపోతుంది. మనం కుకింగ్ నేర్చుకోవడం వల్లనే 10 నిమిషాల్లో తినేస్తున్నాం. కుకింగ్ లేకపోతే.. మనం కూడా వాటిలాగే.. గంటలు గంటలు బియ్యం నములుతూ ఉండాలి. ఈ ఉడకబెట్టడం నేర్చుకోవడం వల్లనే గ్రెయిన్స్ అన్నీ తినగలుగుతున్నాం. దాని వల్ల మన బ్రెయిన్ సైజ్ మారింది. బ్రెయిన్లో స్పేస్ ఎక్కువైంది. ఇప్పుడు 10 నిమిషాల్లో తినేస్తాం. చేయి కడిగేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. బోర్.. ఆ తర్వాత పిచ్చిలెస్తది.
ఓటీటీ కంటెంట్లు బోర్ కొడుతున్నాయ్. పుస్తకాలు బోర్ కొడుతున్నాయ్. అద్దంలో చూసుకుంటే నీ ముఖం నీకే.. చిరాకుగా ఉంటుంది. జుట్టు నిక్కబొడుచుకుని.. సెల్ఫీ తీసుకుంటే, మనం, కరోనా ఒకేలా కనబడుతున్నాం. మరి నీతో నువ్వు కూర్చున్నప్పుడు.. నువ్వు నీకే బోర్ కొడితే.. మరి మాకెంత బోర్ రా నువ్వు.. రారా.. రా అని అందరినీ ఫోన్ చేసి పిలుస్తున్నావ్. ఎవడు కూర్చుంటాడు నీతో..? అందుకే వీలైనంత ఎక్కువ టైమ్.. మీతో మీరు కూర్చోండి. మీరెంత బ్యాడ్ కంపెనీయో మీకే తెలుస్తుంది. ఎడ్యుకేషన్ మేక్స్ పీపుల్ రెస్ట్లెస్.." అని పూరి బోర్డమ్ అనే టాపిక్ గురించి చెప్పుకొచ్చారు.