Advertisement

వాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరి

Oct 4 2020 @ 22:07PM

మనం మనిషి బతికున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకనివ్వం. చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి క్షణాల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. లేకపోతే అసంతృప్తితో చనిపోతారు. ధైర్యంగా, నిజంగా, నిజాయితీగా, అందంగా బతికినాళ్లు మాత్రమే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు.. అని అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన డీసెంట్ డెత్‌ అనే టాపిక్‌ మీద మాట్లాడారు. మరి అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

 

"ఒక లివింగ్‌ ఆర్గనిజంలో బైలాజికల్ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతే.. దాన్ని డెత్‌ అంటారు. డెత్‌ అవగానే బాడీ డికంపోజయ్యి.. పాంచ భౌతికమైన దేహం మళ్లీ పంచభూతాలలో కలిసిపోతుంది. పూర్వం చావుని చూసి మనలాగ భయపడేవారు కాదు. డెత్‌ ఈజ్‌ పార్ట్ ఆఫ్‌ లైఫ్‌లా చూసేవాళ్లు. తమిళనాడులో ఒక రిచ్యుయల్‌ ఉండేది. దానిపేరు తలైకూత్తల్‌. అదేంటంటే.. బాగా ఓల్డ్ అయిపోయినాక.. నేను ముసలివాడిని అయిపోయాను. జీవితంలో అన్నీ చూశాను.. ఇంక పిల్లలకు బర్డెన్‌ అవకూడదు అని డిసైడ్‌ చేసుకుని, తనకు కావాల్సిన వారందరినీ పిలుచుకుని, మనవళ్లు, మనవరాళ్లు అందరితో రెండు రోజులు గడిపి.. ఆ తర్వాత ఆ రిచ్యుయల్‌ చేసేవారు. ఈట్స్ లైక్ మెర్సికిల్లీ.  ఆ ముసలాయనకి ఉదయాన్నే ఒళ్లంతా ఆయిల్‌ బాత్‌ చేయించడం, కొబ్బరినీళ్లు తాగించడం.. వంటి ప్రాసెస్‌ జరుగుతుంది. అలా చేస్తే.. వాళ్లకి విపరీతమైన జ్వరం వచ్చి.. కిడ్నీ ఫెయిలై.. రెండు రోజుల్లో చచ్చిపోయేవారు. దానినే డీసెంట్‌ డెత్‌గా భావించేవారు. 


అయితే తర్వాత్తర్వాత ఈ రిచ్యుయల్‌ని అడ్డం పెట్టుకుని ఆస్తికోసం ఇంట్లో ముసలివాళ్లని చంపేయడం మొదలుపెట్టారు. దానితో ప్రభుత్వం దీనిని నిషేధించింది.  ఇప్పుడది చేస్తే చాలా నేరం. అయితే లైఫ్‌లో డీసెంట్‌గా బతికినవాళ్లే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు. ఇండియాలో ఉన్న లా ప్రకారం ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి ట్రీట్‌మెంట్‌ విత్‌ డ్రా చేయడం లాంటివి చేయకూడదు. గుండె ఆగి చనిపోతే సిపిఆర్‌ తప్పనిసరిగా చేయాలి. పేషెంట్‌ చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. కానీ పిల్లలు అతనికి చెప్పవద్దని ఆ విషయం దాస్తుంటారు. అతను వాళ్లకి తండ్రో, తాతో అయ్యింటాడు. అతనే వీళ్లందరినీ పెంచాడు. అన్ని కష్టాలూ తెలిసినవాడు. అతను చూడంది కాదు.. ఇలాంటి ఎన్నో చావులు చూసిన మనిషి. అలాంటి మనిషికి మనం నిజం చెప్పకుండా దాస్తుంటాం. చెబితే తప్పేముంది. ముందుగా తెలిస్తే.. ఆయనేదో ప్లాన్ చేసుకుంటాడు కదా. 

కానీ అబ్రాడ్‌లో వేరే రూల్స్ ఉన్నాయ్‌. పేషెంట్‌ అడ్మిట్‌ అవ్వగానే.. డాక్టర్‌కి తెలిసిపోతుంది.. బతుకుతాడో? లేదో?. వెంటనే టెర్మినల్‌ లీవ్‌ ఈవెంట్‌ రాసేస్తారు. రాసి వెంటనే పేషెంట్‌కి చెప్పేస్తారు.. నువ్వు చనిపోతున్నావు అని.  అతను ఎవరికి చెప్పమంటాడో కనుక్కుని,  వాళ్లకి మాత్రమే డాక్టర్లు చెబుతారు. ఒకవేళ అతను ఎవరికీ చెప్పవద్దు అంటే ఎవరికీ చెప్పరు. అలాగే పేషెంట్‌ని అడిగి అడ్వాన్స్ డైరెక్టివ్‌ రాస్తారు. నేను ఎలా చనిపోదాం అనుకుంటున్నాను? ఎంత వరకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలి? గొట్టాలవీ పెట్టాలా? వద్దా?. సిపిఆర్‌ చేయాలా? వద్దా?. ఇలాంటి వన్నీ పేషెంట్‌ని అడిగి రాసుకుంటారు. దాన్నిబట్టే ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. ఎక్కువ సఫరింగ్‌ లేకుండా.. పేషెంట్‌కి ఇష్టమైన విధంగా.. సుఖంగా ప్రాణాలు వదిలెట్టు.. అక్కడ పేషెంట్‌ చెప్పే ప్రతి ఓపెనియన్‌కి వేల్యూ ఇస్తారు. ఎందుకంటే చాలా మంది.. నేను అల్రెడీ 95. ఇంకెంతకాలం బతకగలను. పిల్లలకి నేను చేయాల్సింది చేసేశాను. నన్ను మనశ్శాంతిగా పోనివ్వండి అంటారు. ఇక అక్కడి నుంచి వార్డులో ఉన్న డాక్టర్లు, నర్సులతో ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ.. హాయిగా చనిపోతారు. 90 శాతం పీపుల్‌ ప్రాణాలు నర్సులు, డాక్టర్ల చేతిల్లోనే వదిలేస్తారు. రోజూ చావుని దగ్గరగా చూసేది వాళ్లే. 


ఇక్కడ మనం బతికున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకనివ్వం. చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి క్షణాల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. లేకపోతే అసంతృప్తితో చనిపోతారు. జీవితంలో చివరి క్షణాలు.. వాళ్ల ప్రతి చివరి క్షణం చాలా ఇంపార్టెంట్‌. వుయ్‌ మస్ట్ వేల్యూ థెమ్‌. ధైర్యంగా, నిజంగా, నిజాయితీగా, అందంగా బతికినాళ్లు మాత్రమే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు.." అని పూరీ డీసెంట్‌ డెత్‌ గురించి చెప్పుకొచ్చారు. ఇవి కూడా చదవండి :

అడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.