Advertisement

దేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరి

Oct 13 2020 @ 22:12PM

'మేము మగాళ్లం.. మా అమ్మలు అనుకునేంత మంచివాళ్లం కాదు. పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హజ్బండ్‌ గానీ, పర్ఫెక్ట్ వైఫ్‌ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే ఎడ్జస్ట్‌మెంట్ ఆఫ్‌ ఇండియా..' అని అన్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'పర్ఫెక్ట్ హజ్బండ్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. శ్రీరాముడి వంటి దేవుడ్ని చేసుకున్న సీతమ్మ వారు కూడా కష్టాలు పడ్డారని పూరీ చెప్పుకొచ్చిన 'పర్ఫెక్ట్ హజ్బండ్‌' విశేషాలేంటో తెలుసుకుందామా.. 

 

''పెళ్లి అయిన ఆడవాళ్లందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండవచ్చు.. పర్ఫెక్ట్ తల్లి ఉండవచ్చు.. పర్ఫెక్ట్ డ్రైవర్‌, పర్ఫెక్ట్ నర్సు ఉండవచ్చు కానీ పర్ఫెక్ట్ హజ్బండ్‌ ఎక్కడా ఉండడు. ఇట్స్ ఏ మిథ్‌. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి.. ఇలాగే ఇలాగే అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని కష్టాల్లో పడిపోతారు. మొగుడ్ని కస్టమైజ్‌ చేయలేం. అందుకే పెళ్లి అయిన ప్రతి ఆడది.. ఏదో ఒక టైమ్‌లో కన్నీళ్లు పెట్టాల్సిందే. తప్పదు. లైఫ్‌లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు.. పక్కలోనే ఉంటాడు. మనకి చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు.. సీక్రెట్‌గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది.. తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్ని సార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు చేసుకోండి. ఏం.. మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్లని క్షమించినట్లే.. మీ మొగుడ్ని కూడా క్షమించి వదిలేయండి. 

మీ కంట్లో కన్నీరు చూడకపోతే.. పక్కింటి వదినగారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మొగుడితో గొడవ పడవద్దు. పోనీ ఆయన మొగుడేమైనా శ్రీరామచంద్రుడా? కాదే. అందరి పెళ్లాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్లామే. మొగుడు ఎంత గొప్పవాడైతే.. భార్యకి అన్ని కన్నీళ్లు వస్తాయ్‌. ప్రతి దేవుడు వాళ్ల భార్యను ఏడిపించిన వాళ్లే. పెళ్లాం కంట కన్నీళ్లు పెట్టించని ఒక్క దేవుడి పేరు చెప్పండి నాకు. మొగుడి వల్ల కొంత ఏడుస్తారు. వేరే ఆడదాని వల్ల కొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చని తెలిస్తే.. అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు.  అవసరమా?. అందుకే మీరు సుఖంగా ఉన్నట్లు దయచేసి ఏ పిన్నిగారికీ చెప్పవద్దు. కనిపించిన ప్రతిసారీ కష్టాలు చెప్పండి. అమ్మయ్యా.. దీని జీవితం కూడా నాలాగే ఏడిచింది సామీ.. అది చాలు నాకు అని హ్యాపీగా వెళ్లిపోతుంది. 

ఇక తప్పులు చేసే మొగుడ్ని.. మీ అన్నయ్యో.. తమ్ముడో, నాన్నో అనుకుని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయ్‌. మమ్మల్ని కాదని. మీరు నిజంగా సాక్షాత్తూ ఆ దేవుడ్ని పెళ్లి చేసుకుంటే.. మీరు ఇంకా ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. ఆ దేవుడు ఇంటికి రాడు. ముళ్లోకాలు తిరుగుతుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు. ఆయన చేసే పనులు చూసి.. ఎందుకు ఆయనని పెళ్లి చేసుకున్నామా అని తలకొట్టుకుని ఏడుస్తారు. ఎంతో కొంత మేమే బెటర్‌. మాతోనే ఎంతో గుట్టుగా.. అలా కాపురాలు కానిచ్చేయండి. ఏవండి.. మేము మగాళ్లం.. మా అమ్మలు అనుకునేంత మంచివాళ్లం కాదు. పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హజ్బండ్‌ గానీ, పర్ఫెక్ట్ వైఫ్‌ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే ఎడ్జస్ట్‌మెంట్ ఆఫ్‌ ఇండియా.. అంతే..'' అని పూరి చెప్పుకొచ్చారు.  



ఇవి కూడా చదవండి :

ప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.