నేను జీనియస్‌ని కాదు.. ఫూల్‌ని అని అనుకుంటే.. నీ చుట్టు పక్కల ఉన్నవారందరూ నిన్ను ప్రేమిస్తారు. ఎంత కష్టాన్ని అయినా, కోపాన్ని అయినా ఫన్నీ వేలో ప్రజంట్ చేస్తే.. అందరూ అట్రాక్ట్ అవుతారు. అదే సెన్సాఫ్ హ్యూమర్ అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'సెన్సాఫ్ హ్యూమర్' అనే టాపిక్ గురించి మాట్లాడారు. సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే ఎటువంటి రోగాలు రావని, ఎప్పుడూ హెల్దీగా ఉంటారని తెలిపారు. ఏ క్యారెక్టర్ నీలో ఉంటే.. నీ జీవితం మారిపోతుందో.. అదే సెన్సాఫ్ హ్యూమర్ అని చెప్పారు. ఇంకా ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.
సెన్సాఫ్ హ్యూమర్.. ఇట్స్ యాజ్ ఎబిలిటీ టు ఫైండ్ థింగ్స్ ఫన్నీ. సెన్సాఫ్ హ్యూమర్ మీలో ఉండాలంటే.. మీకు కొంచెం డిటాచ్డ్ మెండ్ ఉండాలి. మీరు మరీ ఈగోయిస్ట్ అయితే కుదరదు. మీ మీద మీరు జోక్స్ వేసుకునే కెపాసిటీ ఉండాలి. అప్పుడే మజా. సర్ధార్జీల మీద మనం చాలా జోకులు వింటుంటాం. ఇండియాలో అందరికీ సర్ధార్జీ అంటే డేడ్థిమాక్ అనే ఫీలింగ్. మనందరం సర్దార్జీలంటే బుర్రతక్కువ వాళ్లని ఫిక్సయ్యాం. బారాభజేగాళ్లని నవ్వుకుంటాం. నో.. వాళ్లు చాలా చాలా ముదుర్లు. వాళ్ల మీద వాళ్లే జోక్స్ వేసుకుంటూ మనల్ని నవ్విస్తుంటారు. కాబట్టి మనం అలా అనుకుంటాం. ఎదుటివాడిని జీనియస్‌లాగా, వాళ్లేమో ఫూల్స్‌లాగా కలరింగ్ ఇస్తుంటారు. అది మనం నమ్ముతాం. మనమేంటి.. మొత్తం కంట్రీని నమ్మించారు. సర్దార్జీస్ ఆర్ డబుల్ ఇస్మార్ట్. ఖుష్వన్ సింగ్ అని ఓ పెద్దాయన ఉండేవాడు. సర్ధార్జీల మీద ఆయన వేసిన జోకులు ఎవరూ వేయలేరు. సంటా, బంటా అంటే మనం ఫుల్స్ అనుకోవద్దు. మనల్ని నవ్వించడానికి వాళ్లు క్రియేట్ చేసిన క్యారెక్టర్లు. అందుకే మనం సర్ధార్జీస్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. సెన్సాఫ్ హ్యూమర్ అనేది లీడర్షిప్ క్వాలిటీ. అడుక్కునే సర్ధార్ని ఎప్పుడైనా చూశారా? నెవ్వర్. వాళ్లు ఎక్కడున్నా బతికేయగలరు. వారికున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే సెన్సాఫ్ హ్యూమర్. హ్యూమర్ మన క్యారెక్టర్ బలం అవ్వాలి. అందుకే జోక్స్ ప్రాక్టీస్ చేయండి. అందరినీ నవ్వించండి. స్టాండప్ కామెడీస్ చూడండి. లైఫ్‌లో మనం చాలా సీరియస్‌గా తీసుకున్న విషయాలను వాళ్లు.. మనకి ఫన్నీ వేలో ప్రజంట్ చేస్తారు. వాళ్ల పర్సెప్షన్ అలవాటు చేసుకోండి. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు సెంట్రాఫ్ది అట్రాక్షన్ అవుతారు. దానివల్ల మీ గ్రోత్ మారిపోతుంది. మీకు తెలియకుండానే మీరు లీడర్ అయిపోతారు. గ్రేట్ లీడర్స్‌ని పరిశీలించండి. ధే యూజ్ లాటప్ హ్యూమర్. సరదాగా పిట్టకథ చెబుతూ.. పెద్ద ఫిలాసఫీ చెప్పేస్తారు మనకి.
చాలా హర్టింగ్గా ఉండే విషయాలు కూడా ఫన్నీ వే లో చెప్పేయవచ్చు. దీని వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గిపోద్ది. బ్లడ్ సర్క్యూలేషన్ బాగుంటుంది. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. అంతేకాదు.. ఏ సబ్జెక్ట్ అయినా.. ఈజీగా అర్థం చేసుకుంటూ పోతారు. తెలియకుండా తప్పు చేసినా.. దానిని మీ మీద మీరే జోక్ వేసుకుంటూ.. ఇంత వయసు వచ్చినా.. ఇంకా తప్పులు చేస్తున్నావా గురూ.. నాకు ఇంకెప్పుడు బుద్ది వస్తది అని అనండి. మీ చుట్టూ ఉన్న అందరూ నవ్వేస్తారు. లేకపోతే దానిని పెద్ద మిస్టేక్‌లా ప్రొజెక్ట్ చేస్తూ.. మీ బాస్‌కి కంప్లయింట్ చేస్తారు. సెన్సాఫ్ హ్యూమర్ వల్ల మీ క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మీరు ఈజీగా బయటపడతారు. పెయిన్, యాంగర్ మీ చుట్టుపక్కలకు రావు. సెన్సాఫ్ హ్యూమర్ లేని వాళ్లే ఎక్కువ ఏడుస్తారు. చొక్కాలు చింపుకుంటారు. సోషల్ మీడియాలో యాంగ్రీ పోస్ట్‌లు పెడతారు.
మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే.. తల్లిదండ్రుల తిట్టులు కూడా సరదాగా ఉంటాయ్. పెళ్లాం బండబూతులు తిట్టినా.. నవ్వుతూ.. స్నేహితులతో షేర్ చేసుకుంటారు. కోపంలో ఉన్న మీ బాస్‌ని నవ్వుతూ క్షమించమని అడగండి.. మీరే అతనికి ఫేవరెట్ ఎంప్లాయ్ అయిపోతారు. సర్ధార్జీ ముఖం చూశారా. చిరు నవ్వు ఉంటుంది. అది మ్యాజిక్. నేను ఫూల్‌ని అని ప్రొజెక్ట్ చేసుకోండి.. అందరికీ మీరు లవబుల్ అయిపోతారు. అదే నేను జీనియస్‌ని అని చెప్పండి.. చుట్టుపక్కల ఉన్నవారందరికీ ఎక్కడో కాలుతుంది. చేసే హెల్ప్ కూడా చేయరు. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే మీకు ఏ జబ్బులు ఉండవు. ఎప్పుడూ హెల్దీగా ఉంటారు. అందుకే మనం దానిని డెవలప్ చేసుకోవాలి. నాలో ఏ ఒక్క క్యారెక్టర్ ఉంటే.. నా జీవితం మారిపోద్ది అని నువ్వు నన్ను అడిగితే.. అది సెన్సాఫ్ హ్యూమర్.