Advertisement

ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరి

Oct 9 2020 @ 23:12PM

డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌.. తన పూరీ మ్యూజింగ్స్‌లో 'ప్లాప్‌ సినిమా' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. ప్లాప్‌ సినిమా గురించి ఆయన ఏం చెప్పారో.. ఆయన మాటలలోనే తెలుసుకుందాం.. ''ఫ్లాప్ మూవీస్.. ఫ్లాప్‌ని ఎవరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందో తెలిస్తే ఎవరూ సినిమా తీయరు. ఏడాదిలో రెండు వందల సినిమాలొస్తే.. హిట్‌లు బ్లాక్ బస్టర్‌లు కలిపి పదే ఉంటాయి. మిగిలిన నూట తొంభై ఫ్లాపులే. జీవితాంతం ఈ ఫ్లాప్ సినిమాలు చూడలేక.. వాటిని ఎనలైజ్ చేయలేక.. జర్నలిస్టులకి తిక్కలేసి.. రివ్యూలతో వాయించి పడేస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలూ అలాగే ఏడుస్తున్నాయ్‌. ఆ రివ్యూల దెబ్బకి అప్పటికే అన్నీ అమ్ముకున్న ప్రొడ్యూసర్.. ఇండస్ట్రీ వదిలేసి పోతాడు. అతడి ప్లేస్‌లో ఇంకొకడు వస్తాడు. ఇంకో ఫ్లాప్‌ సినిమా తీస్తాడు. నిజం ఏమిటంటే.. ఆ నూట తొంభై ఫ్లాప్ సినిమాల మీదే.. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది. ఇక్కడున్న అందరికీ అన్నం పెట్టేవి అవే. ఫ్లాప్ సినిమా వల్ల కూడా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక ఫ్లాప్ సినిమా కోసం ప్రొడ్యూసర్ కోట్లు ఖర్చు పెడితే.. యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, సెట్లు, అవుట్ డోర్ యూనిట్, లొకేషన్ల కోసం ఇలా ఎంతో మందికి పనిస్తాడు. అందరూ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. గవర్నమెంటుకి టాక్స్‌లు కూడా గడతారు. అందరికీ కవర్లు ఇస్తాడు. హోర్డింగ్‌లకి, పేపర్‌ యాడ్స్‌కి, వెబ్ సైట్స్‌కి, హోటల్‌కి, ట్రైన్లకి, ప్లయిట్స్‌కి ఇలా అందరికీ డబ్బు కట్టే ఉంటాడు. అందరం బెనిఫిట్స్ పొందుతాం. కానీ సినిమా తేడా వస్తే వాడి తాట తీస్తాం. మన రాతలతో, మన ట్వీట్‌లతో మళ్లీ ఆ ప్రొడ్యూసర్‌కి ఇంకెవరు డేట్స్‌ ఇవ్వకుండా.. ఆ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఇంకో సినిమా రాకుండా చూస్తాం.

 

సినిమా రివ్యూస్‌ రాసే అందరికీ చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నా.. మీరు కాపాడాల్సింది ఫ్లాప్‌ మూవీస్‌ని.. బ్లాక్ బస్టర్స్‌ని కాదు. ఐ నో యు ఆర్‌ ఆల్ ప్రస్టేటేడ్‌ బ్యాడ్ మూవీస్‌. బట్‌ ఇక్కడ ఎవరూ జీనియస్ కాదు. తెలిసో తెలియకో.. డైరెక్టర్ ఫ్లాప్‌ తీసి ఉండొచ్చు. కానీ వాడి వల్ల కొంతమందికి తిండి దొరుకుతుంది. వాడు బుర్ర తక్కువవాడు కావచ్చు. వాడిని, ఆ ప్రొడ్యూసర్‌ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు రేటింగ్ ఒకటే ఇవ్వాలనిపిస్తే రెండు ఇవ్వండి. రెండే వేయాలి అనిపిస్తే మూడు వేయండి. ఆ ఒక్క స్థానం పెరగటం వల్ల శాటిలైట్ అమ్ముడవుతుంది. దాని వల్ల ఇంకొన్ని కుటుంబాలు బతుకుతాయి. అంతేకానీ, నిర్థాక్షిణంగా వాళ్లని చంపేయవద్దు. కావాలంటే పర్సనల్‌గా కలిసినప్పుడు వాడిని తిట్టండి. ఏంట్రా ఈ సినిమా అని? కళామతల్లి కడుపున ఎక్కువగా పుట్టింది ఫ్లాప్ డైరెక్టర్‌లు, ఫ్లాఫ్‌ ప్రొడ్యూసర్లే. బ్లాక్ బస్టర్స్‌ తీసే ఆ పదిమంది పిల్లల్నీ మీరు ఎత్తుకోనవసరం లేదు. మీరందరూ ఎత్తుకోవాల్సింది వీరినే. ఎందుకంటే మీరు కూడా కళామతల్లి బిడ్డలే. వాళ్లు మీ అన్నదమ్ములే. దయచేసి ఒకర్నొకరు శత్రువులా చూసుకోవద్దు. నీ తమ్ముడికి ఇంకో సినిమా వస్తే.. ఇంకో సినిమా మొదలవుద్ది. మిగతావాళ్లు చేయలేనిది వాడు చేశాడు. సినిమా తీశాడు. కొన్ని ఫ్యామిలీస్‌కైనా ఫీడింగ్‌ దొరుకుతుంది.  

బిజినెస్ యాంగిల్ లో చూస్తే అసలు సినిమా తీయకూడదు. ఇంత రిస్కీ బిజినెస్ ఎవరు చేస్తాడు? సినిమా అంటే పిచ్చి ఉన్నోడు? వాడే చేస్తాడు. అలాంటి పిచ్చోడు బతకాలి. ప్రతి ఫ్లాప్ సినిమా వెనుక పదేళ్ల కష్టం ఉంటుంది. ఓ వంద కుటుంబాలుంటాయి. ఫ్లాప్ తీసినోడు కనబడితే గట్టిగా ఒక హగ్ ఇవ్వండి. ఎందుకంటే వాడు వంద మందికి తిండిపెట్టిన హీరో. అంతేగానీ, చెత్త సినిమా తీశాడని చెట్టుకు కట్టేసి కొట్టవద్దు. వాడికి తీయడం రాదనుకుంటే నువ్వు సినిమా తియ్‌. ఎవడో ఒకడు ఇక్కడ సినిమా తీయాల్సిందే తప్పదు. ఫ్లాప్ అవుతుందని ముందే తెలియదు కాబట్టే ఇక్కడ ఫ్లాపుల తీస్తున్నాము. ఆ ఫ్లాపులుగానీ లేకపోతే అందరం అడుక్కుతింటాం" అని పూరీ చెప్పుకొచ్చారు.ఇవి కూడా చదవండి :

ఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.