''నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రీ హిస్టారిక్ టైమ్‌లో.. దాదాపు 15 నుంచి 20 వేల సంవత్సరాల క్రితం మనుషులు ఈ వుల్వ్జ్ని డొమెస్టిక్ చేయడం వల్ల.. కాలక్రమంలో అవి కుక్కలైపోయాయ్. వాటిని హంటింగ్ కోసం వాడేవారు. అవి మనుషులతోనే ఉండిపోయి అలా గార్డింగ్ చేస్తూ బతికేసేవి. సైబీరియన్ హస్కీని ఫస్ట్ డాగ్ అని చెబుతారు. ఇప్పటికీ వాటి ముఖాలు వుల్వ్స్లానే ఉంటాయ్ చూడండి. వెదర్ ఛేంజ్ వలన మనుషులు బ్లాక్స్, వైట్స్.. అయిపోయినట్లుగా మనతో ఉన్న కుక్కలు కూడా మారిపోయి.. రకరకాల బీడ్స్ తయారయ్యాయి. ఇప్పుడు కొన్ని వందల్లో బీడ్స్ ఉన్నాయి. టిబిటెన్ మాస్టిఫ్ పప్పీని కోటి రూపాయలకు అమ్ముతారు. ఆ ఒక్క కుక్క సింహాన్ని చంపేస్తది. ప్రపంచంలో 600 మిలియన్ డాగ్స్ ఉంటే.. అందులో 400 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. వాటికి ఇళ్లు లేదు. పాపం ఎక్కడ తింటాయో, ఏం తింటాయో. అందుకే స్ట్రీట్ డాగ్స్ కనబడితే వాటికి ఫుడ్ పెట్టండి. మనుషులను అమ్ముకుని అడవులను వదిలేసి మనకోసం ఇక్కడ బతుకుతున్నాయ్. అవి సాటి కుక్క కంటే మనల్నే ఎక్కువ ప్రేమిస్తాయ్. ఎవరైనా చనిపోతుంటే.. ముందుగా అరిచేది అవే. ఈవినెంగ్ వాక్‌కి మీరు కుక్కని తీసుకుని వెళ్లండి.. బోలెడు మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. మీకంటే మీ కుక్క స్మార్ట్ అయితే.. దానికి బోలెడంత మంది ఫ్రెండ్స్ అవుతారు. కుక్కల వల్ల చాలా పెళ్లిళ్ళు అయ్యాయ్. వర్క్ చేసి ఇంటికి రాగానే.. మీ కుక్కని చూస్తే.. అని మరిచిపోతారు.." అంటూ.. పూరీ డాగ్స్ గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.