"అనాగరికత దశ నుంచి బతకడానికి మనిషి నానా కష్టాలు పడ్డాడు. బిక్కు బిక్కు మంటూ అడవిలో జంతువుల మద్య బతకడం అంత ఈజీ కాదు. రకరకాలుగా తనని తాను రక్షించుకుంటూ వస్తున్నాడు. పులి, సింహాల నుంచి తప్పించుకోవడానికి మనిషి కనిపెట్టిన ఆయుధం బాణం, బరిసె. ఎండా, వానల కోసం కనిపెట్టిన ఆయుధం గుడిసె. క్రిమికీటకాలు, జబ్బుల కోసం కనిపెట్టిన ఆయుధం వైద్యం. చివరిగా మనిషి నుంచి మనిషిని కాపాడటం కోసం మనిషి కనిపెట్టిన ఆయుధం మానవత్వం. ఈట్స్ ఏ వెపన్.. బట్ ఇన్విజబుల్ వెపన్.
దేవుడు కూడా మానవత్వం కోసమే బతుకుతున్నాడని చెప్పాం. అవతలివాడిని నమ్మించాం. వాడు నమ్మాడు. అందుకే మనల్ని వదిలేశాడు. లేకపోతే ఎప్పుడో ఏసేసేవాడు. దేవుడు మిగతా యానిమల్స్ని పట్టించుకోడు. ఆయన ఫోకస్ అంతా మనమీదే. మనం అన్ని జంతువులను చంపేయవచ్చు. కానీ మనిషిని మనిషి చంపకూడదురో. దేవుడికి నచ్చదు. దేవుడు బతుకుతున్నదే మనుషుల కోసం.. అని చెప్పాం. అందుకే అన్ని రిలిజియెన్స్కి మెయిన్ హెడ్డింగ్ మానవత్వం. దానికోసమే పనిచేస్తుంటాయ్. అయినా సరే కొట్టుకు చస్తున్నాం. చంపుకుంటున్నాం. కానీ కష్టాల్లో ఉన్న మనిషికి నిజంగా సాయం చేసే మనుషులు ఉన్నారు. జాలిపడే వాళ్లెందరో ఉన్నారు. వాళ్లలో ఉన్నది మనిషి స్వార్థంతో కనిపెట్టిన మానవత్వం కాదు. ఇంకా ఏదో గొప్ప గుణం ఉంది వాళ్లలో. దానికి వేరే పేరు పెట్టాలని ఉంటుంది నాకు. మీకు ఏదైనా తడితే నాకు చెప్పండి. అది మానవత్వం కంటే మంచి పేరు అయ్యిండాలి.
లోయలో పడి చనిపోతున్నవాడిని ఒకడు కాపాడాడు. అప్పుడు వాడు అంటాడు.. అన్నా.. సమయానికి నిన్ను ఆ దేవుడే పంపించాడన్నా అంటాడు. అనవసరంగా దేవుడికి క్రెడిట్ ఇస్తే నాకు నచ్చదు. తిరిగి వాడిని అదే లోయలో పడేయాలని అనిపిస్తది. మనకి నరనరాల్లో దేవుడు ఎక్కేశాడు. మంచి మనుషులను కూడా తీసుకెళ్లి దేవుడి అకౌంట్లో వేయకండి. మీకు నిజంగా సాయం చేసేది, కాపాడేది ఎప్పుడూ సాటి మనిషే. ఆ మనిషికి రెస్పక్ట్ ఇవ్వండి..." అని పూరి మానవత్వం గురించి చెప్పుకొచ్చారు.