Advertisement

అతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరి

Sep 19 2020 @ 17:12PM

అతిగా ఏం చేసినా ఓవరాక్షనే అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఏదైనా కొంచమే చేయమని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాదు కొంచెం కొంచెం చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటో కూడా చెప్పుకొచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో 'లిటిల్‌' అనే టాపిక్‌ మీద పూరీ మాట్లాడారు. కొంచం కొంచం చేయడం వల్ల తప్పు చేసినా సరిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా లిటిల్‌ గురించి ఆయన ఏం చెప్పారో.. ఆయన మాటల్లోనే విందాం.

 

''లైఫ్‌లో ఏం చేసినా కొంచమే చేస్తే మంచిది. ఎక్కువ చేయవద్దు. కొంచం తినండి. కొంచం తాగండి. విపరీతంగా తాగవద్దు. అదే పనిగా పేకాట ఆడవద్దు. కాసేపు ఆడుకోండి. కాసేపు పనిచేయండి. కాసేపు ఎక్సర్‌సైజులు చేయండి. అన్నీ కొంచం కొంచం చేస్తే చాలు. కొంచం నవ్వండి. కొంచం ఆడండి. కొంచమే ప్రేమించండి. కొంచమే ఏడవండి. కొంచం చదువుకోండి. కొంచం నేర్చుకోండి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, వ్యసనాలు కావచ్చు. ఎనీథింగ్‌.. ఏదైనా కొంచంతో సరిపెట్టుకోండి. ఓవరాక్షన్ చేయవద్దు. షేర్లు కూడా కొంచమే కొనండి. మొత్తం తీసుకెళ్లి అందులో పెట్టవద్దు. ఎక్కువ దానధర్మాలు కూడా ఓవరాక్షనే. ఎక్కువ పార్టీలు కూడా ఓవరాక్షనే. ఎక్కువ మంచితనం, ఎక్కువ దుర్మార్గం.. ఎనీథింగ్‌ టు మచ్‌ ఈజ్‌.. తప్పున్నర తప్పు.  లైఫ్‌లో అన్నీ కొంచం కొంచం చేస్తే.. అది అందరికీ మంచిది. ఒకవేళ చిన్న చిన్న తప్పులు జరిగినా సరిదిద్దుకోవడానికి ఉంటది. కోపం వస్తే కొంచెం కొట్టండి. రెండు తగిలించండి. అంతేకానీ మర్డర్‌ చేయవద్దు. దేవుడికి దణ్ణం పెట్టుకోండి తప్పులేదు.. యజ్ఞాలు, యాగాలు చేయవద్దు. దేశాన్ని దొబ్బేద్దాం అనుకునే వాళ్లు చేసే పనులవి. ఇవన్నీ ఓవరాక్షన్ కిందే వస్తాయి. కొంచం నీరు, కొంచం నిప్పు..అంతే.." అని పూరి జగన్నాధ్‌ 'లిటిల్' గురించి చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి :

మీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్బ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.