''చిన్న పిల్లలు క్యూట్‌గా ఉంటారు. వాళ్లని అందరూ లవ్ చేస్తారు. కుక్క పిల్లలు ఇంకా ముద్దుగా ఉంటాయ్. అందరూ ఎత్తుకుంటారు. వాడితో ఆడుకుంటారు. అందమైన ఆడపిల్లలని, ఆడవాళ్లని చూస్తే.. ఎవరికైనా ఇష్టమే. అందుకే అందరూ వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. ఇలా అందర్నీ అందరూ అన్ కండీషనల్‌గా లవ్ చేస్తూ ఉంటారు. కానీ మగాళ్లను మాత్రం చూడగానే ఎవ్వరూ లవ్ చేయరు. ఎవ్వరూ ఎత్తుకోరు. ఎవ్వరూ ముద్దు పెట్టుకోరు. సో స్వీట్.. అని మన బుగ్గ పట్టుకుని ఎవరూ గిల్లరు. వై?. వై అంటే ఆన్సర్ లేదు. మగాడు ఏదైనా చేయాలి. ఏదైనా తేవాలి. ఏదన్నా ఇవ్వాలి లేదా ఏదైనా అయిపోవాలి. ఏమీ లేకుండా మనల్ని ఎవ్వరూ ఎత్తుకోరు. ముద్దు పెట్టుకోరు. అందుకే ఏదన్నా చేయండి. ఖాళీగా ఉండొద్దు.
నువ్వు ఎంత అందగాడివైనా.. ఏ అమ్మాయి నీ ముఖం చూడదు. నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా.. నీ ఫోన్ నెంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్‌గా ఉంటారు. సత్తా ఉన్నవాడినే ప్రేమిస్తారు. దమ్ముంటే నీ సత్తా ఏమిటో చూపించు. ఒక సామెత ఉంది. ఎందుకూ పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నాడని. ఆరున్నర అడుగులు ఉంటాడు. వాడు పడుకుంటే.. కాళ్లు మంచం కూడా దాటి వస్తుంటాయ్. కానీ ఏమీ చేయడు. ఎందుకు మరి? వేస్ట్ కదా! అందుకే మగాడన్నాక కష్టపడాలి. ఎక్కడో విన్నాను. ఆకాశానికి ఎయిమ్ చేసేయ్. ఎగిరి పట్టుకో. ఫెయిలైతే కనీసం కొబ్బరి చెట్టు మీదైనా పడతావ్. అయినా పర్లేదు. ఎందుకంటే.. అప్పటికే మిగతావారి కంటే ఎత్తులో ఉంటావ్. మనం ఎలాంటి టార్గెట్ పెట్టుకోవాలంటే.. మన మొబైల్ నెంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవాలి. ఏంటి మీ మొబైల్ నెంబర్? ఒక్కసారి లెక్కపెట్టండి. పది కోట్లు అనుకుంటున్నారేమో? కాదు.. అది 9 డిజిట్ నెంబర్. అంత వైట్ అమౌంట్ మీ బ్యాంక్‌లో ఉండాలి. అవుతుందా? అయ్యే పనేనా? అనుకుంటే అన్నీ అవుతాయ్.
నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఓ రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ పై నుంచి హైదరాబాద్ చూశా. సిటీ మొత్తం ఎన్నో లక్షల ఇళ్లు. అన్ని ఇళ్లల్లో లైట్లు వెలుగుతున్నాయ్. నగరం మొత్తం దీపావళిలా ఉంది. ఎక్కడ చూసినా.. ఇళ్లే. ఇంత పెద్ద సిటీలో ఇల్లు కట్టిన వారందరూ బాగా తెలివైన వాళ్లా? జీనియస్‌లా? అని నన్ను నేను అడిగా. లోపలి నుంచి కాదు అని ఆన్సర్ వచ్చింది. అంటే యావరేజ్ మైండ్స్, బిలో యావరేజ్ మైండ్స్ ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకోగలిగారు. అలా అయితే మనమూ ఒక రోజు కట్టేద్దాంలే అనుకుని.. కొండ దిగి కృష్ణానగర్ నడుచుకుంటూ వెళ్లిపోయా. ఈ రోజు వేల వేల కోట్లు సంపాదించిన వాళ్లందరూ.. పుట్టుకతోనే జీనియస్‌లు మాత్రం కాదు. కానీ లైఫ్‌లో ఎంతో కష్టపడ్డారు. వాళ్లలాగే మనమూ కష్టపడదాం. ఏదో ఒక రోజు మన మొబైల్ నెంబర్ని మన బ్యాంక్ బ్యాలెన్స్ చేసేద్దాం. 9 డిజిట్ కాకపోతే.. 8 డిజిట్. లెట్స్ జంప్ ఇన్ టు ద స్కై. కనీసం కొబ్బరి చెట్టు మీదైనా పడతాం. ." అని పూరి మొబైల్ నెంబర్ ఎందుకో తెలిపే ప్రయత్నం చేశారు.