రెబల్ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదని అన్నారు డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఆయన పూరి మ్యూజింగ్స్ల్లో 'రెబల్' అనే టాపిక్ మీద ఆయన మాట్లాడారు. రెబల్ వల్ల సొసైటీ మారుతుంది కానీ, సొసైటీ వల్ల రెబల్ మారడు అని తెలుపుతూ.. రెబలియన్ అనేది యాటిట్యూడ్ పర్శనాలిటి అని అన్నారు. ఎవరివల్లా డిస్టర్బ్ అవకుండా ఇంటిలిజెంట్‌గా బతికేవాడే 'రెబల్' అని పూరి.. రెబల్ అనే పదానికున్న ఇంపార్టెన్స్‌ను తెలిపారు. ఇంకా రెబల్ గురించి పూరి ఏం తెలిపారో.. ఆయన మాటలలోనే తెలుసుకుందాం.
''రెబల్.. హు ఈజ్ రెబల్? రెబలియన్ అనేది యాటిట్యూడ్ పర్శనాలిటి. వ్యక్తిగతంగా నీమీద నీకు రెస్పెక్ట్ ఉండాలి. నేనందరికంటే తోపు అని.. మిగతావాళ్లని చీప్‌గా చూడటం కాదు రెబల్ అంటే. గుర్తు పెట్టుకో.. నీకంటే పైన ఎవ్వడూ లేడు. నీకంటే కిందా ఎవడూ లేడు. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకునే వాడు రెబల్. చుట్టూ ఉన్న స్టూపిడిటెస్ అన్నింటికి ఎగైనెస్ట్‌గా ఉండేవాడు రెబల్. ఒక రెబల్ వల్ల సొసైటీ మారుతుంది కానీ, సొసైటీ వల్ల రెబల్ మారడు. ఇంటిలిజెంట్‌గా బతకడం నేర్చుకున్నవాడు రెబల్. సే హౌ యువర్ లుకింగ్ ఎట్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్. సొసైటీలో జరిగే ప్రతిదానికి ఎఫెక్ట్ అవకూడదు. సొసైటీ వలన ఎప్పుడూ క్రౌడ్ ఎఫెక్ట్ అవుతుంది. రెబల్ అనేవాడు ఎప్పుడూ క్రౌడ్‌లో ఉండడు. అలాగని రెబల్ అనేవాడు సొసైటీకి ఎగైనెస్ట్ కాదు. సొసైటీలో ఉన్న నాన్సెన్స్కి దూరంగా ఉంటాడు. సెల్ఫ్ ఓరియంటెడ్ ఫెలో.
అంతేకానీ.. రెబల్ అంటే టెర్రరిస్ట్, నక్సలైట్‌గా ఫీలైపోయి, గందరగోళం చేసి, డ్యాన్స్ల్లు ఆడాల్సిన పనిలేదు. సీ.. మన తెలివితేటలన్నీ రెండే రెండు విషయాలకు పనికొస్తాయ్. నిన్ను నువ్వు ఎలా హేండిల్ చేస్తున్నావ్? నీ చుట్టూ ఉన్నవాళ్లని ఎలా హేండిల్ చేస్తున్నావ్? అంతే. ఎవరి వల్లన డిస్టర్బ్ అవ్వకుండా ఇంటిలిజెంట్‌గా బతికేవాడు రెబల్. ఎవడి మాట వినొద్దు. మనిషి మాట అస్సలు వినొద్దు. నీ నిర్ణయం నువ్ తీసుకోగలిగితే.. నువ్ రెబల్.." అని పూరి రెబల్ గురించి తన పూరి మ్యూజింగ్స్‌లో తెలిపారు.