''మీ అందరికీ బ్యాంక్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసు. అయితే 35 సంవత్సరాల క్రితం ఎడ్గర్ ఖాన్ అనే వ్యక్తి ఒక కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ కనిపెట్టాడు. అదే టైమ్ బ్యాంక్. అయితే ఇది మనీ బేస్డ్ కాదు. సర్వీస్ బేస్డ్. అవర్ టైమ్ ఈజ్ మనీ. రోజూ కొన్ని గంటలు మీరు పనిచేస్తే.. అది మనీయే కదా. టైమ్ బ్యాంకింగ్ అనేది ఒకరి సర్వీస్‌ని ఒకరు పంచుకునే సర్వీస్ సిస్టమ్. ఇది ముఖ్యంగా మీరు ఖాళీగా ఉన్న టైమ్‌ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. టైమ్ బ్యాంక్‌లో జాయిన్ అయిన మెంబర్స్ అందరూ.. ఒక కమ్యూనిటీ అనుకుంటే.. ఒకరి సర్వీస్‌ని ఇంకొకరు తీసుకుంటారు. మనీ రూపంలో కాకుండా.. టైమ్ బేస్డ్ క్రెడిట్స్ ఉంటాయ్. అవి మీకు ఇచ్చిన కార్డులో యాడ్ అవుతూ ఉంటాయ్. మీరు ఒక గంట వేరే వారి కోసం పనిచేస్తే.. వన్ టైమ్ క్రెడిట్ మీకొస్తది. అయితే ఆ క్రెడిట్ వేల్యూ అందరికీ ఒకటే ఉంటుంది. కమ్యూనిటీలో వేరు వేరు వారు ఉండవచ్చు. అందరికీ ఒకటే క్రెడిట్ ఉంటుందంటూ..'' పూరీ చెప్పిన టైమ్ బ్యాంక్ గురించి ఇంకా తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.