Advertisement

వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరి

Sep 22 2020 @ 22:54PM

వైన్ తాగడం ఒక ఆర్ట్.. కొన్ని దేశాల్లో ఫుడ్‌ తిని, ఈ వైన్‌ తాగి చనిపోవచ్చని తెలిపారు డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన 'వైన్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. వైన్‌ పుట్టుక, రకాలు, పేర్లు, వైన్ టేస్టింగ్‌ కోర్స్, వైన్ తాగడానికి ఉండే ప్రత్యేక గ్లాస్‌లు వంటి వాటి గురించి ఆయన చాలా వివరంగా తెలిపారు. మరి ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


"వైన్ అంటే.. ఫార్మెంటెడ్‌ గ్రేప్ జ్యూస్‌. 7000 సంవత్సరాల క్రితం చైనాలో మొట్టమొదటిసారి వైన్‌ను తయారు చేశారు. ఆ తర్వాత జార్జియా, ఇరాన్‌, సిసిలీలో మెల్లగా మొదలైంది. ఒక్కో గ్రేప్‌ను బట్టి ఒక్కో టేస్ట్. అలాగే ఆ గ్రేప్ ఎక్కడ పెరిగింది. వెదర్, క్లైమెట్‌, సన్‌లైట్‌, వాటర్‌ వీటిని బట్టి కూడా రకరకాల టేస్ట్‌లు వస్తాయ్‌. క్యాబనిస్ సోరియాన్‌, మెర్లో, టెంపరానిలో, గామె, చిరా, పినునోయర్‌ ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయ్‌. అందరికీ రెడ్‌ వైన్, వైట్‌ వైన్, రోజే తెలుసు. అయితే ఈ వైట్‌ వైన్‌కి గ్యాస్ ఫిల్‌ చేస్తే.. దానిని స్పార్కిలింగ్‌ వైన్ అంటారు. ఫ్రాన్స్‌లో షాంపెయిన్‌ అని ఒక రిజియన్‌ ఉంది. అక్కడ దొరికే స్పార్కిలింగ్‌ వైన్ మాత్రమే షాంపెయిన్‌ అంటారు. పోర్చుగల్‌లో వచ్చిన వైన్‌ని పోర్ట్ వైన్‌ అంటారు. అలాగే గ్రీన్‌ వైన్ ఉంది. ఇది కూడా పోర్చుగల్‌లో మాత్రమే చేస్తారు.  గోస్‌ మలిస్కో అనే సీ ఫుడ్‌ తింటూ.. ఈ గ్రీన్ వైన్ తాగుతారు.. అద్భుతంగా ఉంటుంది. ఈ వైన్‌ని టేస్ట్ చేసి, దానిని క్వాలిటీని డిసైడ్‌ చేయడానికి వైన్ టేస్టర్స్ ఉంటారు. వాళ్లని సొమాలియే అంటారు. ఈ సొమాలియస్‌ వినియార్డ్స్‌లో ఫైవ్‌ స్టార్ హోటల్స్‌లో వర్క్ చేస్తారు. వైన్ తాలుకూ లుక్‌, కలర్‌, ఒపాసిటి, స్మెల్‌, రోమా.. ఇవన్నీ చూస్తారు.   అలాగే వైన్‌ తాగితే టంగ్‌ మీద ఎలాంటి టేస్ట్ ఉంది, స్వాలో చేసినాక ఎలా ఉంది? ఇలా ఎన్నో చెక్‌ చేసి దాని జాతకం చెబుతారు. ఇలాంటి ఉద్యోగం మీరు చేయాలనుకుంటే.. వైన్ టెస్టింగ్‌ కోర్స్‌ చేయవచ్చు. ఆ కోర్స్ కాస్ట్ 10 వేల డాలర్లు. 

 

ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌, అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చైనా..  ఈ కంట్రీలు వైన్ ప్రొడ్యూసింగ్‌లో టాప్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ఇటలీలో టస్కనీలో చాలా వినియార్డ్స్‌ చూశాను నేను. ఆ క్లైమెట్‌, ఆ స్పాయిల్‌, అక్కడున్న ఫార్మర్స్, ఆ గ్రీనరీ చూస్తే పిచ్చి లేస్తది. వైన్స్‌లో అన్ని వెరైటీస్‌ నేను ఎక్కడా చూడలా. పెద్ద పెద్ద ఉడెన్‌ బేలల్స్‌లో స్టోర్ చేస్తారు. అగ్లీ ఒలే ఒలే పాస్తా తింటూ బ్రెడ్‌ మీద ఆలివ్‌ ఆయిల్‌ వేసి దానిని కొరుకుతూ.. స్మోక్ టపచ్చీస్ తింటూ.. ఆ వైన్స్ అన్నీ టేస్ట్ చేసుకుంటూ..  అక్కడే ప్రాణం వదిలేయవచ్చు. వెనియార్డ్స్‌లో ఫుడ్‌ తిని రెండు మూడు గంటలు ఎవరూ కదలరు. అలా.. మత్తులో ఉంటారు. ఎవరైనా మన చెవిలో నారాయణ, నారాయణ అంటే.. మెల్లగా ఆత్మ అనంత వాయువుల్లో కలిసిపోతది. ఆ రేంజ్‌లో ఉంటది ఫుడ్‌. ఈ వైన్స్‌ని గ్రేప్, గ్రేప్స్‌ నేమ్‌తోనే కాకుండా..  అవి ఏ విలేజ్‌ నుంచి వచ్చేయో.. ఆ విలేజ్‌ పేర్లతో కూడా పిలుస్తారు. చబ్బీస్‌, వెజాలే, క్లూనీ ఇలా చాలా విలేజ్‌ నేమ్స్ ఉన్నాయ్‌. ఇకపోతే మాల్డోవా. మాల్డోవాలో ప్రపంచంలో అతి పెద్ద వైన్ సెల్లింగ్‌ ప్లేస్‌ ఉంది.  దాని పేరు మిలెస్తి మిస్సి. భూమి కింద అండర్‌ గ్రౌండ్‌లో పెద్ద సెల్లార్‌ కట్టారు. ఆ వైన్‌ సెల్లార్‌ సైజ్‌ వింటే మీకు మతి పోతుంది. 200 కిలోమీటర్స్. లోపల అన్నీ చిన్న చిన్న చీజ్‌లా ఉంటాయ్‌. వైన్ కొనుక్కోవాలంటే మీరు కార్లు వేసుకుని లోపల తిరగాలి. ఉడెన్ బేలల్స్ మధ్య మనం తిరుగుతూ వెళితే.. ఎన్నో రకాలైనా వైన్స్‌ని చూడవచ్చు. ఒక్కసారి యూట్యూబ్‌లో ఆ వీడియో చూడండి.. మీకే అర్థమవుతుంది. అంత పెద్ద వైన్ సెల్లార్. బిగ్గెస్ట్ వైన్‌ కలక్ట్ ఇన్ ది వరల్డ్. 

ఇకపోతే రెడ్‌ వైన్‌. ఈ రెడ్‌ వైన్‌ తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయ్‌. ఆడవాళ్లు, మగవాళ్లు రోజూ చెరో గ్లాస్‌ వైన్‌ తాగితే.. చాలా మంచిది. కామ్‌ అవుతాం. అన్నీ బీకేమ్ రొమాంటిక్‌ అవుతాం. వైన్ తాగడం ఒక ఆర్ట్. ముందు ఆప్యాయంగా బాటిల్‌ పట్టుకుని,  గ్రేప్ పేరు చదవాలి. ఆ గ్రేప్‌కి సరిపడే గ్లాస్ తీసుకోవాలి. మీకు తెలుసా? ప్రతి గ్రేప్‌కి ఒక మోడల్‌ వైన్ గ్లాస్‌ ఉంది. 18 వైన్ గ్లాస్‌ మోడల్స్ ఉన్నాయ్. సో రైట్‌ గ్లాస్‌ తీసుకుని, కొంచెం మాత్రమే అందులో పోసి, ముందు దాని స్మెల్‌ చూడాలి. తర్వాత దానిని సోర్‌లింగ్‌ చేయాలి. ఇట్స్ బీత్సన్నమాట. అలాగే గ్లాస్‌ పట్టుకునే పద్దతుంది. అది నేర్చుకోవాలి. ఛీజ్‌, ఆలివ్స్ దగ్గర పెట్టుకుని వైన్‌ని స్విప్ చేయాలి. ఇలా ఎంతో ఎంజాయ్‌ చేస్తూ తాగాల్సిన డ్రింక్ వైన్‌" అని పూరి వైన్ గురించి తెలియజేశారు.


ఇవి కూడా చదవండి :

నేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.