ప్రపంచంలో ఉన్న 'జూ'లన్నిటిని క్లోజ్ చేయాలని కోరారు డైరెక్టర్ పూరి జగన్నాధ్. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన 'జూ' అనే టాపిక్ మీద మాట్లాడారు. యానిమల్స్ గురించి అవగాహన కోసం ఈ 'జూ'లు పెట్టారని, కానీ డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ వచ్చిన తర్వాత యానిమల్స్ గురించి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి.. 'జూ'లను తీసేయాలని ఆయన కోరారు. తను చనిపోయే లోపు ప్రపంచంలో ఈ మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా 'జూ' గురించి పూరి ఏమేం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
"జంతు ప్రదర్శన శాల. చిన్నప్పుడు 'జూ' చూడటం అంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉండేది. రకరకాల యానిమల్స్‌ని చూడొచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు. 'జూ'లు మొదలైంది పిల్లల కోసమే. విజ్జానం కోసం. ప్రపంచంలో 10 వేలకు పైగా 'జూ'లు ఉన్నాయి. లైఫ్‌లో ఒకసారి వెళ్లి.. వాటిని చూసేసి వచ్చేస్తాం. కానీ జీవితాంతం కేజ్‌లలో ఉండే వాటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. జంతువులు, పక్షులు కలిపి ఎన్నో లక్షల్లో.. ఆ కేజ్‌లలో నరకం అనుభవిస్తున్నాయి. యానిమల్స్ గురించి అవగాహన కోసం ఈ 'జూ'లు పెట్టారు. కానీ డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి వాటి అవసరం అంత లేదు. 'జూ'కి వెళ్లినా తెలియని ఎన్నో విషయాలు వాటి నుంచి నేర్చుకోవచ్చు.
ఆరు నెలల లాక్డౌన్లో ఉంటేనే మనకి పిచ్చ లేస్తంది. మరి జీవితాంతం వాటికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ అడవుల్లో ఉంటూ మైగ్రేట్ అవుతూ.. వైల్డ్ లైఫ్‌లో బతకాల్సినవి. వాటిని కేజ్‌లలో లాక్ చేయడం వల్ల మెంటల్లీ సిక్ అయిపోయి.. వాటి ఏజ్ కంటే ముందే చచ్చిపోతున్నాయ్. వాటికి పిల్లలు కూడా సరిగా పుట్టడం లేదు. పులులు, సింహాలకు పుట్టిన పిల్లలు, వీక్‌గా పుట్టి.. 50 శాతం పిల్లలు నెలరోజులు తిరగకుండానే చచ్చిపోతున్నాయ్. మిగిలినవీ 6 నెలల కంటే ఎక్కువ బతకడం లేదు. 'జూ'లో ఉన్న ప్రతి యానిమల్ మెల్లగా యక్సెంట్ అయిపోతున్నాయ్. మనలాగే వాటికీ ఎమోషన్స్ ఉంటాయ్, అవి కూడా ఏడుస్తాయ్, కుమిలిపోతాయ్. ఎప్పుడైనా వాటి కళ్లని చూడండి. ఏడ్చి ఏడ్చి కళ్ల కింద కన్నీటి చారలతో ఉంటాయ్. మిమ్మల్ని జైలులో పెట్టి, ఎంత ప్రేమగా చూసుకున్నా ఉండగలరా? అవి కూడా అంతే. వాటికి మనం ఫ్రీడమ్ లేకుండా చేశాం. శాడిస్ట్ల కంటే దారుణంగా తయారయ్యాం. ఇలా వాటిని క్యాప్టివిటీలో జీవితాంతం ఉంచడం చాలా తప్పు.
మీకు తెలుసా.. అవి ప్రతి రోజూ నరకం అనుభవించి అనుభవించి.. సైకలాజికల్‌గా డిప్రస్ అయి, ఆ తర్వాత ప్రస్టేట్ అయి, ఒకదానినొకటి అటాక్ చేసుకుంటున్నాయ్. ఒకదానినొకటి చంపుకుంటున్నాయ్. ప్రతి సంవత్సరం అన్ని 'జూ'లలో ఎన్నో వేల జంతువులు ఇలాంటి ఫైటింగ్లో చనిపోతున్నాయి. ఆన్ నాచురల్ టెంపరేచర్స్‌లో వాటిని పెట్టి హింసిస్తున్నాం. అంటార్కిటికా ఖండంలో బతకాల్సిన పెంగ్విన్లను తీసుకొచ్చి ఇక్కడ పడేశామ్. ఆఫ్రికన్ డిజర్ట్‌లో ఉండాల్సిన ఆస్ట్రిచ్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాం. ఎక్కడో బ్యాక్ వాటర్స్‌లో బతకాల్సిన క్రోకడైల్ ఇక్కడ ఒక చిన్న పాండ్‌లో.. మురికి నీరులో అక్కడక్కడే తిరుగుతూ నరకం అనుభవిస్తూ బతుకుతుంది. వాటి నేచర్‌కి దూరం చేశాం. మన తిండి కోసం యానిమల్స్, చేపలు, పక్షులు కోళ్లు కలిపితే.. ప్రతి రోజూ 3 బిలియన్ జీవాలను మనం చంపుతున్నాం. వీటిని కూడా అలా చంపేసినా బాగుండు. పాపం ఒక్కరోజులో చచ్చేవి. కానీ ఇలా జీవితాంతం వాటిని టార్చర్ చేయడం అనేది చాలా తప్పు. దిస్ ఈజ్ ఐ టైమ్. 'జూ'లన్నీ క్లోజ్ చేయాలి. యానిమల్స్ అన్నింటిని తీసుకెళ్లి వైల్డ్ లైఫ్‌లో వదిలేయాలి. ఇది ప్రపంచమంతా ఒకేసారి చేయాలి. అన్ని కంట్రీస్ కలిసి ఈ డెసిషన్ తీసుకోవాలి. సో.. నేను పోయే లోపు అయినా దానిని చూస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ.." అని పూరి 'జూ' గురించి తెలిపారు.