Advertisement

‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరి

Oct 1 2020 @ 19:51PM

సోషల్‌ మీడియా వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కవ ఉందని అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన 'సోషల్‌ మీడియా' అనే టాపిక్‌ గురించి మాట్లాడారు. సోమచ్‌ ప్రస్ట్రేషన్‌ ఇన్‌ ద వరల్డ్.  ప్రతిదానికి కోప్పడుతూ.. అందరినీ తిడుతూ.. నెగిటివ్‌ కామెంట్స్‌తో రోజంతా గడిపితే.. నష్టపోయేది ఎవరో తెలుసుకుంటే మంచిదన ఆయన హితవు పలికారు. ఇంకా సోషల్‌ మీడియా గురించి ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

 

''అందరికీ సోషల్‌ మీడియా బ్రడ్‌ అండ్‌ బటర్‌లా తయారైంది. కళ్లు తెరవగానే మొబైల్‌ చూడాలి. ఇన్‌స్టాగ్రమ్‌లో అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. కిండర్‌లో రొమాంటిక్‌గా ఉన్నారు. ఒక్క ట్విట్టర్‌లో మాత్రం చాలా యాంగ్రీగా ఉన్నారు. ఒకరినొకరు పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు. రాజుగారి పెద్ద పెళ్లాం చాలా మంచిది అని ట్వీట్‌ చేస్తే.. మరి చిన్న పెళ్లాం? అది మంచిది కాదా? అని మీద పడిపోయే బ్యాచ్ ఉన్నారు. సో మచ్‌ నెగిటివిటి‌. మొన్నకసారి యూట్యూబ్‌లో మదర్ థెరిస్సా మాట్లాడిన ఒక వీడియో చూశా.  వేయి లైక్స్. 10 వేలు డిస్‌ లైక్స్. అర్రె.. నీకు మదర్ థెరిస్సా మాట్లాడింది కూడా నచ్చడం లేదా? ఆవిడ ఏం తప్పు మాట్లాడిందని నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టార్రా.. నా*****.  

సోషల్‌ మీడియా వలన ఉపయోగాలు కంటే దరిద్రాలే ఎక్కువ ఉన్నాయ్‌. మనందరం పెంటకుప్ప చుట్టూ కూర్చొని, నువ్వొ పేడయ్య, నేనొ పేడయ్య.. ఇదే సోషల్‌ మీడియా. ఈ పిడకలు తగ్గాలంటే.. సోషల్‌ మీడియా ప్రతి అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయమని గవర్నమెంట్‌ రూల్‌ పెట్టాలి. దానివల్ల ఆచితూచి మాట్లాడతాం. ప్రపంచంలో ఆడవాళ్లు మొత్తం 350 కోట్లే. కానీ అక్కడ ఆడవాళ్ల ఫేస్‌ బుక్‌ అకౌంట్లు 1000 కోట్లకి పైన ఉన్నాయ్‌. సోమచ్‌ ప్రస్ట్రేషన్‌ ఇన్‌ ద వరల్డ్.  ప్రతిదానికి కోప్పడుతూ.. అందరినీ తిడుతూ.. నెగిటివ్‌ కామెంట్స్‌తో రోజంతా గడిపితే.. సంకనాకి పోయేది మనమే. క్రిటిసైజింగ్‌ అనేది ఒక ఎడిక్షన్‌. ఒకడు నడుస్తూ రోడ్డుమీద వెళుతున్నాడు.  ఏదో కనిపించి ఆగాడు. దానిని కిందా మీదా చూశాడు. అర్థం కాలా. వంగి వాసన చూశాడు.. అయినా అర్థం కాలా. చేతితో తీసి మెల్లగా నాలుకతో నాకినాక తెలిసింది అది పేడ అని. అమ్మో.. పేడా.. ఇంకా నయం నేను తొక్కలేదు.. అనుకున్నాడంట. ఇది జోక్‌ కాదు. మనం రోజూ చేస్తున్న పని అదే.  నా పేడ నువ్వు. నీ పేడ నేను.." అని పూరి సోషల్‌ మీడియా గురించి చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి :

వాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.