"శాన్స్ర్కీట్.. ఎన్షియంట్ లాంగ్వేజ్.50వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఫస్ట్ టైమ్ మనిషి మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతూ.. మనిషి మైగ్రెట్ అయిపోవడం వల్ల.. వేరే వేరే దేశాల్లో వేరే వేరే భాషలు మొదలయ్యాయ్. హిబ్రూ, అరబిక్.. వాళ్లకి ఎన్షియంట్ లాంగ్వేజ్ ఎలాగో మనకి శాన్స్ర్కీట్ అలా. 200 బి.సి. లో పుట్టింది. గాంధార రాజ్యంలో ఫణిని అనే స్కాలర్ ఉండేవాడు. గాంధార రాజ్యం అంటే ఇప్పుడు పాకిస్తాన్. అతనే శాన్స్ర్కీట్కి మూల పురుషుడు. దీని నుంచే చాలా భాషలు వచ్చాయి. లింగ్యుస్టిక్ చదువుకున్నవాళ్లకి బాగా తెలుస్తుంది.. ఏ పదం ఎక్కడి నుంచి వచ్చిందో. శాన్స్ర్కీట్ చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. ఏ భాషలోనూ లేనన్ని సిననిమ్స్ శాన్స్ర్కీట్లో ఉన్నాయ్. ఇంగ్లీష్‌లో ఎలిఫెంట్కి ఇంకో పేరు చెప్పమంటే మనకు తెలియదు. కానీ శాన్స్ర్కీట్లో గజము, హస్తి, మతంగ, మత్తేభము, కరుణి, కుంజరము.. ఇలా వంద పేర్లు ఉంటాయ్. ప్రపంచంలోని ఏ లాంగ్వేజ్‌లోనూ ఇన్ని పదాలు ఉండవ్. అందుకే శాన్స్ర్కీట్లో రాసిన మంత్రాలు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ భాషకి ఒక డివైన్ ఫీలింగ్ ఉంది. అందుకే మంత్రాలు ఎవరైనా చదువుతుంటే అటెన్షన్లోకి వచ్చేస్తాం. అర్థంకాకపోవడం వల్ల.. ఇంకా ఒళ్లు దగ్గర పెట్టుకుని వింటాం. మంత్రాలు ఉచ్చరించడం వల్ల మీ ఉచ్ఛారణ పెరుగుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. మీ లంగ్స్ బెటరవుతాయ్.
మనదేశంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే శాన్స్ర్కీట్ మాట్లాడతారు. చాలా మంది గుజరాతీవాళ్లు.. వాళ్ల ఇళ్లలో శాన్స్ర్కీట్ మాట్లాడతారు. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ శాన్స్ర్కీట్ స్టేట్ లాంగ్వేజ్. అక్కడ కొన్ని విలేజెస్లోని వాళ్లు కూడా శాన్స్ర్కీట్ మాట్లాడతారు. శాన్స్ర్కీట్లో ప్రింట్ అయ్యే పేపరు కూడా ఉంది. దాని పేరు సుధర్మ. అలాగే మనందరికీ తెలుసు.. ఆలిండియా రేడియోలో ప్రతిరోజూ శాన్స్ర్కీట్లో వార్తలు చదువుతారు. అయితే పూర్తిగా శాన్స్ర్కీట్లో మాట్లాడే రేడియో ఉంది. దానిపేరు దివ్యవాణి. ఫ్రీ ఇంటర్నెట్ రేడియో.. ట్రై చేయండి. వినొచ్చు మీరు. శాన్స్ర్కీట్ మనదేశాన్ని ఏకం చేస్తుంది. మీరు శాన్స్ర్కీట్లో మంత్రం చదవండి. అన్ని రాష్ట్రాల వాళ్లు అలెర్ట్ అయిపోతారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నిల్చొని వింటారు. ఎందుకంటే డీప్డౌన్ మన అందరికీ తెలుసు.. సంస్కృతం మన అమ్మ అని. ఈజ్ ఏ ఓషన్ ఆఫ్ విజ్డమ్. ఋగ్వేదం, సామవేదం, యజుర్వణ వేదం, అధర్వణ వేదం, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, గీత.. అన్నీ శాన్స్ర్కీట్లోనే ఉన్నాయి. శాన్స్ర్కీట్లో ప్రతి మాటా స్పష్టత. అంతేకాదు ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో సంగీతంలో ఉండే రిథమ్ ఉంది. నేనొకటి చదువుతాను వినండి.
'జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే
గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్ డమర్వయం
చకార చణ్టతాణ్డవం తనోతు న: శివ: శివం..'
చదువుతుంటే.. శరీరం ఉత్తేజితమై.. గూజ్బంప్స్ వచ్చే భాష ఏదైనా ఉందంటే.. అది సంస్కృతం. శాన్స్ర్కీట్ని దైవ భాష అంటారు. దైవం ఒక్కటే కాదు.. ఎంతో సైన్స్ రాయబడి ఉంది భాషలో. శాన్స్ర్కీట్ మీద రీసెర్చ్ కోసం నాసాలో స్పెషల్‌గా ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలంటే.. శాన్స్ర్కీట్ చాలా సూటబుల్ లాంగ్వేజ్ అని వాళ్లు చెబుతారు. ఇవాళ 17 దేశాల్లోని యూనివర్సిటీలలో శాన్స్ర్కీట్ కోర్సులు ఉన్నాయి. ఒక్క జర్మనీలో 14 యూనివర్సిటీలు, 1200 స్కూల్స్ ఉన్నాయ్. లండన్‌లో జేమ్స్ జూనియర్ అనే స్కూల్ ఉంది. అక్కడైతే శాన్స్ర్కీట్ కంపల్సరీ. పిల్లలంతా కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. అవన్నీ క్రిస్టియన్ కంట్రీస్. అయినా సరే శాన్స్ర్కీట్ని ఎందుకు నేర్చుకుంటున్నారు?. ఎందుకంటే అపారమైన జ్ఞానమంతా శాన్స్ర్కీట్లో రాయబడి ఉంది. అందుకే వాళ్లంతా కామ్‌గా చదివేసుకుంటున్నారు. మనకేమో.. శాన్స్ర్కీట్లో పది అంకెలు కూడా తెలియదు.." అని పూరి శాన్స్ర్కీట్ గురించి చెప్పుకొచ్చారు.