గాడ్ ఈజ్ నాట్ ఏ సేవియర్. కథల్లో, సినిమాల్లో మాత్రమే సేవియర్స్ ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి, మీ నాన్న చనిపోతున్నప్పుడు ఎన్నిసార్లు మొక్కావ్. ఎంత ఏడ్చావ్.. మీ నాన్న బతికాడా? లేదు. సునామీ వచ్చి అందరూ చచ్చిపోయారు. ఏ దేవుడైనా వచ్చాడా? లేదు. నీకూ ఎక్కడో డౌటు. దేవుడు రక్షిస్తాడా? లేదా? అని. కానీ అడగాలంటే భయం. అడుగు.. భయపడొద్దు. నిన్ను చూడటానికే టెంపుల్కి వెళుతుంటే.. లోయలో పడి బస్సులో అందరూ చచ్చిపోతుంటే.. నువ్వు ఏం చేస్తున్నావ్ అని అడుగు. పదేళ్ళ పాపని అత్యాచారం చేస్తుంటే.. ఆ ఏడుపులు నీకు వినబడలేదా? అని అడుగు. అర్థరాత్రి నలుగురు కుర్రాళ్ళు.. ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెడుతుంటే.. ఏం చేస్తున్నాడు దేవుడు?. దేవుడికి తెలియకుండానే ప్రపంచంలో ఇన్ని బాంబులు పేలుతున్నాయా? . నీకు నువ్వే కంఫర్ట్బుల్ ఆన్సర్స్ చెప్పుకుని నోరు నొక్కేసుకోవద్దు. ధైర్యంగా దేవుడిని అడుగు. ఆయన ఏమీ అనుకోడు. నువ్ తిట్టినా.. ఆయన ఏమీ అనుకోడు.. దట్స్ ద బ్యూటీ.." అంటూ సేవియర్ గురించి పూరీ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన సేవియర్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.