దర్శకుడు శ్రీను వైట్లకు పితృ వియోగం

ABN , First Publish Date - 2021-11-29T06:09:13+05:30 IST

ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు(84) హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారు జామున ఆయన నివాసంలో మృతి చెందారు.

దర్శకుడు శ్రీను వైట్లకు పితృ వియోగం

తండ్రికి నివాళులర్పిస్తున్న శ్రీను వైట్ల
ద్రాక్షారామ, నవంబరు 28: ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు(84) హైదరాబాద్‌లో  ఆదివారం తెల్లవారు జామున ఆయన నివాసంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కృష్ణారావు చికిత్స పొందుతున్నారు. వైట్ల కృష్ణారావుకు శ్రీను వైట్ల కుమారుడు కాగా, కుమార్తె శ్రీదేవి కూడా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కృష్ణారావు మృతదేహాన్ని రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామానికి తీసుకువచ్చారు. కందులపాలెం గ్రామంలో కృష్ణారావు మృతదేహానికి పలువురు  నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కృష్ణారావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, మాజీ జడ్పీటీసీ ఇంత సంతోషం, దేవస్థానం చైర్మన్‌ బొప్పన వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T06:09:13+05:30 IST