వీరభద్రమ్‌... క్రైమ్‌ థ్రిల్లర్‌

Published: Sat, 28 May 2022 00:24:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వీరభద్రమ్‌... క్రైమ్‌ థ్రిల్లర్‌

‘అహనా పెళ్లంట’, ‘పూల రంగడు’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు వీరభద్రమ్‌. కాస్త గ్యాప్‌ తరవాత.. ఇప్పుడు థ్రిల్లర్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరభద్రమ్‌ దర్శకత్వంలో నరేష్‌ అగస్త్య కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నబిషేక్‌, తూము నరసింహ పటేల్‌ నిర్మాతలు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ మొదలవుతుంది. ‘‘వీరభద్రమ్‌ అంటే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అయితే ఈసారి ఆయన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ సిద్ధం చేశారు. కథ బాగా నచ్చింది. ఈ కథకు నరేష్‌ అగస్త్య అయితే న్యాయం చేస్తానిపించి, ఆయన్ని హీరోగా ఎంచుకొన్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International