వైకల్యాన్ని ఓడిద్దాం

ABN , First Publish Date - 2020-12-04T04:45:45+05:30 IST

వైకల్యం శరీరానికే కాని మనస్సుకు కాదని, మనో నిబ్బరంతో వైకల్యాన్ని ఓడిద్దామని వక్తలు పేర్కొన్నారు.

వైకల్యాన్ని ఓడిద్దాం
పాలకొల్లు భవిత కేంద్రంలో విజేతలకు బహుమతుల పంపిణీ

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో వక్తల పిలుపు


ఆకివీడు, డిసెంబరు 3: వైకల్యం శరీరానికే కాని మనస్సుకు కాదని, మనో నిబ్బరంతో వైకల్యాన్ని ఓడిద్దామని వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రంలో నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలకు షేక్‌ అంజనీ బీబీ, హెల్పింగ్‌ హార్ట్స్‌ సహకారంతో విద్యా సామగ్రి, పౌష్టికాహారం, బహుమతులు గురువారం అందజేశారు. ఎంఈవో ఎ.రవీంద్ర, హెల్పింగ్‌ హార్ట్స్‌ నిర్వాకులు గవర లక్ష్మి, అనిల్‌, భవిత ఉపాధ్యాయులు జి.మధుసుధాకర్‌, డి.సరిత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.


పాలకొల్లు అర్బన్‌/ టౌన్‌ : దివ్యాంగులను దైవ సమాను లుగా చూడాలని ఎంఈవో ముదునూరి రంగరాజు అన్నారు. భవిత కేంద్రం వద్ద ఐఆర్‌పీ వీటీ శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజే శారు. భీమవరం కేర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గంటా కిరణ్‌ బాబు, సుస్మిత దివ్యాంగులకు దుప్పట్లు, బిస్కెట్లు, కేక్‌ అందజేశారు. కొల్లి సాగర్‌, మట్టా హదస్సా, ఐఆర్‌పీ గోటేటి గాయత్రి, ఐఈడీఎస్‌ఎస్‌ టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.


అంజలి మానసిక వికలాంగుల కేంద్రంలో మిఠాయిలు పంపిణీ చేసి, మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ నాగమణి అధ్యక్షతన ఏవీఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో దివ్యాంగులకు బిస్కెట్లు, కేక్‌లు పంపిణీ చేశారు.


నరసాపురం టౌన్‌: పట్టణంలో శ్రీహరిపేట భవిత స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో పుష్పరాజ్యం మాట్లాడారు. పి.వెంకటేశ్వరావు, ఎస్‌. భరత్‌, దుర్గాభవాని, రామకృష్ణ, సత్యనారాయణ, హెచ్‌ఎం రమేశ్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-04T04:45:45+05:30 IST