Singapore: భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష.. ఇంతకు అతడు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-04-21T18:53:11+05:30 IST

మరణశిక్ష పడిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టులో చుక్కెదురైంది. అతడు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న దరఖాస్తును న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. అంతేగాక ఉరిశిక్ష అమలుకు సంబంధించిన తేదీనిన కూడా ఖరారు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్​లో..

Singapore: భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష.. ఇంతకు అతడు చేసిన నేరమేంటంటే..

ఎన్నారై డెస్క్: మరణశిక్ష పడిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టులో చుక్కెదురైంది. అతడు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న దరఖాస్తును న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. అంతేగాక ఉరిశిక్ష అమలుకు సంబంధించిన తేదీనిన కూడా ఖరారు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్​లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది  నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 


అయితే, మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్​తో బాధపడుతున్నట్లు సమాచారం) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యురోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు అప్పీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను బుధవారం కొట్టేసింది. అలాగే వచ్చే బుధవారం నాగేంద్రన్‌ను ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించింది. దీంతో అతడికి ఉరిశిక్ష అమలు చేసేందుకు సింగపూర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-04-21T18:53:11+05:30 IST