చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-06-17T00:34:23+05:30 IST

రాష్ట్రంలోని చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టులో విచారణ

చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో జువైనల్ బోర్డులు, సంరక్షణ గృహాలు లేవని ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్లలో బాలల సంరక్షణ అధికారులు లేరని ధర్మాసనానికి పిటిషనర్ల న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు సూచించింది. చిన్నారుల అదృశ్యంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని హైకోర్టు పేర్కొంది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 28కి ధర్మాసనం వాయిదా వేసింది. 

Updated Date - 2021-06-17T00:34:23+05:30 IST