ఇక్కడ నిరాశ అక్కడ భరోసా

ABN , First Publish Date - 2022-05-29T05:56:33+05:30 IST

ఎలాంటి ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించాల్సిన నిరాశ్రయ భవనం నిరుపయోగంగా మారింది. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రూ.50లక్షల వ్యయంతో జిల్లా కేంద్రం భువనగిరిలో నిర్మించిన భవనం వృథాగా ఉంటోంది.

ఇక్కడ నిరాశ అక్కడ భరోసా
భువనగిరిలో ప్రారంభానికి నోచని నిరాశ్రయ భవనం

సమన్వయ లోపంతో నిరుపయోగంగా నిరాశ్రయ భవనం

ఆశ్రయం లేక బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల వద్ద కాలం వెల్లదీస్తున్న నిరాశ్రయులు


భువనగిరి టౌన్‌ : ఎలాంటి ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించాల్సిన నిరాశ్రయ భవనం నిరుపయోగంగా మారింది. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రూ.50లక్షల వ్యయంతో జిల్లా కేంద్రం భువనగిరిలో నిర్మించిన భవనం వృథాగా ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా పర్యవేక్షణ కొరవడి ప్రారంభానికి నోచుకోకముందే భవనం కిటికీలు, తలుపులు ఽధ్వంసమవుతున్నాయి. ఆ భవనాన్ని వినియోగంలోకి తెస్తే పనుల నిమిత్తం భువనగిరికి వచ్చే పలువురికి తాత్కాలిక వసతి, భోజనం, న్యాయం, వైద్యం, సామాజిక సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా సంబంధిత అధికారులు ఆలోచించకపోవడంతో నిరశ్రయుల కు రహదారులు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లే దిక్కవుతున్నాయి. కాగా, నల్లగొండ, సూర్యాపేట,మి ర్యాలగూడలో మాత్రం దశాబ్దకాలం నుంచే ని రాశ్రయ భవనాలు వినియోగంలో ఉండి పలువురు అభాగ్యులకు స్వాంతన చేకూరుస్తున్నాయి.


పనుల కోసం పట్టణాలకు వచ్చే వారికి తాత్కలిక ఆశ్రయం కల్పించే ఉద్దేశంతో భవన నిర్మాణానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.50లక్షలు మంజూరుచేశాయి. భువనగిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పక్కన 350గజాల విస్తీర్ణంలో మునిసిపల్‌ పరిపాలనాశాఖ పర్యవేక్షణలో నిరాశ్రయ భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణం పూర్త యి సుమారు మూడు నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భవనం కిటికీలకు బిగించిన అద్దాలు రాళ్ల దాడిలో ధ్వంసం కాగా, కిటికీలు, తలుపులు కూడా రూపు కోల్పోతున్నాయి. అంతేగాక కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కూడా వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పనులు పూర్తయిన భవనాన్ని మునిసిపల్‌ పరిపాలనా విభాగం అధికారులు మునిసిపాలిటీకి అప్పగించాలి. అనంతరం నిరాశ్రయ భవన నిర్వహణ బాధ్యతను ఎంపిక చేసిన ఏజెన్సీకి అప్పజెప్తారు. ఆ ఏజెన్సీకి నిర్వహణ ఖర్చును ఏటా నిర్దేశిత మొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నిరాశ్రయ భవన నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా, స్థానిక మునిసిపాలిటీకి అప్పగించకపోవడంతో తదుపరి కార్యాచరణ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.


ఆశ్రయం ఇలా..

నిరాశ్రయ భవనం వినియోగంలోకి వస్తే బహుళ సేవలు అందుబాటులోకి వస్తాయి. చిరువ్యాపారం, వ్యక్తిగత పనులు, ఇతర అవసరాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం జిల్లా కేంద్రం భువనగిరికి వస్తుంటారు. వారిలో పలువురికి స్థానికంగా బంధుమిత్రగణం లేకపోవడం, హోటల్‌, లాడ్జింగ్‌లో చేరేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పనులు ముగిసిన అనంతరం గ్రామానికి చేరేందుకు వసతులు లేక బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆలయాలు, రహదారులపై ఆశ్రయం పొందుతున్నారు. ఈ తరహా వ్యక్తులకు తాత్కాలిక ఆశ్ర యం నిరాశ్రయుల భవనంలో లభిస్తుంది. పనులు ము గిసే వరకు ఇక్కడ ఉచితంగా ఉండవచ్చు. కొద్ది రోజుల పాటు భోజన సౌకర్యం కూడా పొందవచ్చు. ప్రతి రోజు ఐదుగురికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. సొంతంగా వంట చేసుకోవాలనుకునే వారికి గ్యాస్‌ సిలిండర్‌, స్టౌవ్‌, గిన్నెలు, తదితర వంట సామగ్రి కూడా ఇస్తారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు ఉంటాయి. అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు, వివాదాలతో నిరాశ్రయ భవనానికి చేరే వారికి న్యాయ సేవలు అం దుతాయి. ఎలాంటి నివాసం వసతి లేనివారు నిరాశ్రయ భవనం చిరునామాతో ఆధార్‌కార్డు పొందే సదుపాయం కూడా ఉంది. సామాజిక భద్రతా పింఛన్‌ తదిత ర ప్రభుత్వ పథకాలు అందేలా ఏజెన్సీ సహకరిస్తుంది. నిరాశ్రయ భవనంలో భార్యభర్తలకు వసతి కల్పించి, ఒంటరి మహిళలకు మాత్రం షీటీమ్‌ సహకారంతో సఖీ కేంద్రాల్లో వసతి కల్పిస్తారు. కాగా, ఆశ్ర యంలేని వారికి సొంత ఇంటిని మరిపించే నిరాశ్రయ భవనాన్ని అధికారులు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.


వెంటనే వినియోగంలోకి తేవాలి : బొక్క రాంబాయి, సామాజిక కార్యకర్త, భువనగిరి

భువనగిరిలో లక్షల వ్యయంతో నిర్మించిన నిరాశ్రయ భవనాన్ని వెంటనే వినియోగంలోకి తేవాలి. అందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలి. ఆశ్రయం పొందే అవకాశం లేకపోవడంతో పనుల నిమిత్తం భువనగిరికి వస్తున్న పలువురు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలతో పాటు జనసామర్ధ్య ప్రాంతాల్లో ఇబ్బందుల నడుమ కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరాశ్రయ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి.



బాధిత మహిళలకు అండగా నిలుస్తున్న భరోసా కేంద్రాలు

పేటలో ఏడాది కాలంలో 114 మందికి సేవలు

సూర్యాపేట క్రైం: సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నా యి. కొన్ని కేసులే వెలుగు చూస్తుండగా, మరికొన్ని కేసులు పరువు పేరుతో స్టేషన్ల వరకు చేరడం లేదు. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు, బాలికలకు మానసికంగా ధైర్యం, వైద్య సదుపాయం, న్యాయసలహాలు అం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే సఖీ కేంద్రాలు ఉన్నప్పటికీ బాధితులకు మెరుగైన సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో భరోసా కేం ద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఏడాది క్రితం సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించగా, మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.


బాలికలు, మహిళలకు సేవలు

సమాజంలో అన్యాయానికి గురైన మహిళలు, బాలికలకు పోలీ్‌సస్టేషన్ల లో కేసులు నమోదు మొదలు వారికి న్యాయం జరిగేంత వరకు అన్ని రకాలుగా భరోసా కేంద్రం సేవలందిస్తోంది. బాధితుల తరఫున కేసు నమోదు విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా, నిందితులు శిక్ష నుం చి తప్పించుకోకుండా భరోసా కేంద్రం నిర్వాహకులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బాధిత మహిళలు వారికి జరిగిన అన్యాయాన్ని పోలీ్‌సస్టేషన్ల లో వివరించాలంటే కొంత ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో భరోసా కేంద్రంలో ఉండే మహిళా పోలీస్‌ అధికారి సమక్షంలో బాధితులు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశముంది. ఆతరువాత కోర్టుకు వెళ్లినపుడు న్యాయ సలహా సైతం అందిస్తారు. అదే విధంగా శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్న వారికి భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తారు. అనంతరం వారికి మనోధైర్యం కల్పించేందుకు మానసిక నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు వైద్య సేవలు కూడా అందిస్తున్నారు.


114 మందికి భరోసా

సూర్యాపేటలో ఏడాది క్రితం పోలీ్‌సశాఖ, మహిళా శిశు భద్రత విభాగం ఆఽధ్వర్యంలో భరోసా కేంద్రం ప్రారంభమైంది. ఈభరోసా కేంద్రంలో లీగల్‌ అడ్వయిజర్‌,సైకాలజిస్ట్‌, డెటాఎంట్రీ ఆపరేటర్‌, కేర్‌టేకర్‌, ఏఎన్‌ఎం, ముగ్గు రు పోలీస్‌ అధికారులు, కౌన్సిలింగ్‌ సిబ్బంది మొత్తం కూడా మహిళలే ఉన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రానికి సువెన్‌లై్‌ఫ సైన్సెస్‌ ఆర్థిక సహకారం అందించింది. పట్టణ శివారులో సువెన్‌ లైఫ్‌ సైన్సెన్‌ కంపె నీ ప్రాంగణంలో సుమారు రూ.40లక్షల వ్యయంతో భరోసా కేంద్రానికి పక్కా భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడే సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 114 మంది బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సేవలందించారు.


బాధితులు భరోసా కల్పిస్తున్నాం : ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, సూర్యాపేట జిల్లా ఎస్పీ

ఏదైనా సందర్భాల్లో అన్యాయానికి గురైన మహిళలు, బాలికలకు భరోసా కల్పించేందుకు పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు ధైర్యం, పునరావాసం, న్యాయ సలహాలు అందిస్తున్నాం. సూర్యాపేట కేంద్రంలో ఇప్పటికే 114మందికి సేవలందించాం. మహిళల రక్షణ విషయంలో పోలీ్‌సశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.




Updated Date - 2022-05-29T05:56:33+05:30 IST