విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-07-05T05:04:04+05:30 IST

విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ తప్పనిసరి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు. జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక ఆధ్వర్యంలో ‘క్యాంపస్‌ కాప్స్‌’ కార్యక్రమాన్ని సోమవారం రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో నిర్వహించారు.

విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి
మాట్లాడుతున్న జిల్లా ప్రధానన్యాయమూర్తి గోపి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి :
విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ తప్పనిసరి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు. జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక ఆధ్వర్యంలో  ‘క్యాంపస్‌ కాప్స్‌’ కార్యక్రమాన్ని సోమవారం రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. పరిశోధనాత్మకంగా పుస్తకాలను చదవాలని.. అప్పుడే విజ్ఞానం లభిస్తుందని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు సమయపాలన, నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. ఎస్పీ జీఆర్‌ రాధిక మాట్లాడుతూ విద్యార్థి దశలో చట్టాలు, శిక్షలు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, విఠలేశ్వరరావు, డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు, సీఐలు అంబేద్కర్‌, ఈశ్వర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

రాజీ మార్గమే శరణ్యం
కలెక్టరేట్‌, జూలై 4: కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే శరణ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ సన్నాహాల్లో భాగంగా సోమవారం కోర్టు హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూరి జి. చక్రపాణి, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు కె.నాగమణి, ఎం.అనురాధ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, జూనియర్‌ సివిల్‌ జడ్డిలు కె.రాణి, డి.భరణి, సౌమ్యఫిన్‌ పాల్గొన్నారు.
 

Updated Date - 2022-07-05T05:04:04+05:30 IST