ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్‌పై... రాయితీ

ABN , First Publish Date - 2022-07-05T23:27:51+05:30 IST

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై 15 శాతం, డీజిల్‌పై 20 శాతం చొప్పున రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.

ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్‌పై... రాయితీ

* అక్టోబరు 1 నుంచి గ్రీన్ ట్యాక్స్ లేదు

న్యూఢిల్లీ : ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై 15 శాతం, డీజిల్‌పై 20 శాతం చొప్పున రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన ధరలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కాగా...  అక్టోబరు ఒకటి నుంచి గ్రీన్ టాక్స్ కూడా ఉండబోదు. మొత్తంమీద... రానున్న రోజుల్లో చక్కెర, చమురు కంపెనీలకు పన్ను భారం తగ్గనుంది. డీజిల్, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఛార్జీలను మరింత తగ్గించింది. దిగుమతి సుంకాలతోపాటు, విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఇథనాల్-బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇక... ఇథనాల్-బ్లెండింగ్ ప్రమోషన్ దేశీయ చెరకు రైతులకు వ్యయతగ్గింపును అందిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-07-05T23:27:51+05:30 IST