మద్యం సరఫరాలో వివక్ష తగదు

ABN , First Publish Date - 2021-04-24T05:08:48+05:30 IST

తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్న బార్‌లకు మద్యం సరఫరా చేయడంలో వివక్షత చూపుతున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు జెర్రిపోతులపాలెంలోని ఐఎంఎల్‌ డిపో-2 అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ రమణమూర్తికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

మద్యం సరఫరాలో వివక్ష తగదు
డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ రమణమూర్తికి వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు

ఐఎంఎల్‌ డిపో-2 అధికారికి టీడీపీ నేతల వినతి


గోపాలపట్నం, ఏప్రిల్‌ 23: తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్న బార్‌లకు మద్యం సరఫరా చేయడంలో వివక్షత చూపుతున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు జెర్రిపోతులపాలెంలోని ఐఎంఎల్‌ డిపో-2 అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ రమణమూర్తికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వహణకు ప్రభుత్వ పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసి ఇప్పుడు మద్యం సరఫరా చేయడానికి వివక్షత చూపడం వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులకు కావలసిన మద్యం సరఫరా చేయని పక్షంలో లైసెన్స్‌లు రద్దు చేసి తమ సొమ్మును వాపసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మొల్లి ముత్యాలనాయుడు, లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడి,్డ మొల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీనివాసరావు, బొండా జగన్‌, పులి వెంకటరమణరెడ్డి, గంధం శ్రీనివాస్‌, స్థానిక టీడీపీ నేతలు గల్లా శ్రీనివాస్‌, గవర సత్తిబాబు, ఇల్లపు శ్రీనివాస్‌, గంతకోరు శివ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T05:08:48+05:30 IST