బహుజనుల రాజ్యాధికారంపై చర్చించండి

ABN , First Publish Date - 2022-08-15T05:35:38+05:30 IST

మంథని నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బహుజ నులకు రాజ్యాధికారం రావా లనే చర్చలను ప్రజల్లో నిరం తరం చర్చించి రాబోయే రోజుల్లో రాజకీయంగా చరి త్ర సృష్టిద్దామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బహుజనుల రాజ్యాధికారంపై చర్చించండి
జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభిస్తున్న పుట్ట మధు

- స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, ఆగస్టు 14: మంథని నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బహుజ నులకు రాజ్యాధికారం రావా లనే చర్చలను ప్రజల్లో నిరం తరం చర్చించి రాబోయే రోజుల్లో రాజకీయంగా చరి త్ర సృష్టిద్దామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేర కు దేశ స్వాతంత్య్ర వజ్రోత్స వాల సందర్భంగా జాతీయ సమైక్యత ర్యాలీని పుట్ట మధు ఆధ్వర్యంలో తన నివా సం నుంచి గాంధీచౌక్‌ వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌ జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన తన 4 ఏళ్ల పాలన పై చర్చ జరగడం కాదని.. 40ఏళ్ల పాటు కొనసాగిన అగ వర్ణ కుటుంబ పాలనపై చర్చ కొనసాగేలా ప్రజలను చైత న్యవంతులను చేయాలని కోరారు. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఏదైనా రాజకీయంగా ఎదిగితే కాంగ్రెస్‌ నేతలు తమపై అనేక అసత్య ప్రచారాలు, అవినీతి అరోపణలు, మరో విధంగా అనేక అవమానాలుకు గురిచేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియా వేదికగా విపరీతం గా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అనేక విచారణల్లో వీటి లో ఒక్కటి ఇప్పటివరకు నిరూపణ కాలేదన్న విషయం మంథనిప్రాంత ప్రజలకు తెలుసున్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచులో ఉందన్నారు. ఇందిరా, రా జీవ్‌ గాంధీల కుటుంబాలతో పదవులు పొందిన కాంగ్రెస్‌ నేతలు వారి విగ్రహాలను, మహానీయుల విగ్రహాలను మం థని నియోజకవర్గంలో ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేట న్నారు. మంథనిలో గాంధీజీ విగ్రహాన్ని కనీసం పట్టించుకు న్న దాఖలాలు లేవన్నారు. మంథనిప్రాంతంలో ఒకే కుటుం బ పాలనతో అనేక విఽధాలుగా ప్రజలకు నష్టం జరిగిందన్నా రు. వీటిని ప్రజలకు వివరించడానికి త్వరలో ప్రజలకు వద్ద కు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షణి-రా కేష్‌, జడ్పీటీసీ తగరం సుమలత, శంకర్‌లాల్‌, శ్రీరాంభట్ల సంతోషిణి, కొత్త శ్రీనివాస్‌, కొండ శంకర్‌, పూదరి సత్యం, భూపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:35:38+05:30 IST