దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై Supreme courtలో విచారణ

ABN , First Publish Date - 2022-05-20T17:53:59+05:30 IST

సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది.

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై Supreme courtలో విచారణ

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు(Supreme court)లో విచారణ మొదలైంది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.  సిర్పూర్‌కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను లాయర్‌ శ్యామ్‌దివాన్ కోరారు. అయితే సిర్పూర్‌కర్ నివేదికలో గోప్యం ఏమి లేదని... దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ మేం కమిషన్ వేశాం.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తాము’’ అని తెలిపారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ అన్నారు. అయితే నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టొద్దని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని... ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ తేల్చి చెప్పారు. సిర్పూర్‌కర్‌ కమిషన్ రిపోర్ట్‌ను హైకోర్టుకు పంపిస్తామని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. 

Updated Date - 2022-05-20T17:53:59+05:30 IST