దిశ పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎస్పీ రవీంద్రనాధ్బాబు
ప్రారంభించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
కాకినాడ
క్రైం, మార్చి 26: మహిళలు, చిన్నారులకు మానవ మృగాలతో ప్రమాదం పొంచి ఉన్న
అత్యవసర సమయాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దిశ
పెట్రోలింగ్ వాహనాలు ఎంతో ఆసరాగా ఉంటాయని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు
అన్నారు. జిల్లాకు కేటాయించిన 9 పెట్రోలింగ్ వాహనాలను శనివారం ఎస్పీ
లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర
పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన
భద్రత, క్షేత్రస్థాయిలో నేరాలను అరికట్టడం, విజిబుల్ పోలీసింగ్, తదితర
సేవలకు దిశ పెట్రోలింగ్ వాహనాలు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలో మహిళలు,
చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ వారి రక్షణ కోసం ముఖ్యమంత్రి
దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభించారన్నారు. ఈ వాహనాలు ముఖ్యంగా మహిళలు,
విద్యార్థులు ఎక్కువగా ఉండే కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఊరి
శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో నిత్యం గస్తీ నిర్వహిస్తామన్నారు.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలిసింగ్
మెరుగుపరచడం తదితర కీలకమైన సేవలకు ఈ వాహనాలు వినియోగిస్తామన్నారు. ఈ
వాహనాల్లో ఒక ఎస్ఐ స్ధాయి అధికారి, ఒక హెచ్‌సీ, ఇద్దరు మహిళా
కానిస్టేబుళ్ళు గస్తీ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో చింతూరు ఏఎస్పీ
జి.కృష్ణకాంత్, అడ్మిన్ ఎస్పీ కె.కుమార్, ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ,
ఎస్బీ డీఎస్పీ అంబికాప్రసాద్, దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ తదితరులు
పాల్గొన్నారు.