సైబర్‌ కేసుల ఛేదన

ABN , First Publish Date - 2021-12-01T05:22:44+05:30 IST

గుర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన సైబర్‌ నేర కేసులు ఎట్టకేలకు ఛేదించి వారి నుంచి రూ.7,79,993తో పాటు 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ చెప్పారు.

సైబర్‌ కేసుల ఛేదన

  20 సెల్‌ఫోన్లు,  రూ.7,79,993  స్వాధీనం

విజయనగరం క్రైం: గుర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన సైబర్‌ నేర కేసులు ఎట్టకేలకు ఛేదించి వారి నుంచి రూ.7,79,993తో పాటు 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ చెప్పారు. మంగళ వారం ఆయన తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ నెలలో గుర్ల మండలం దేవునికణపాకకు చెందిన కోలాటి సత్యారావుకు కస్టమర్‌ కాల్‌ సెంటర్‌ నుంచి డిజిటల్‌ ఇండియా బ్యాంకు సిబ్బందిమంటూ ఫోన్‌ చేశారు. కొంత మొత్తం డిపాజిట్‌ చేస్తే తమ కంపెనీ లావాదేవీల సర్వీసు సెంటర్‌ నిర్వహించుకుని ఆదాయం పొందవచ్చునని నమ్మ బలికారు. దీంతో కోలాట సత్యారావు పలు దఫాలు వారు పంపిన ఖాతా నెంబర్ల కు రూ.7,79,773 బదిలీ చేశారు. ఆ తర్వాత కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఎంత ప్రయత్నిస్తున్నా... వారి నుంచి సమాధానం దాటవేస్తూ... ఇంకొంత మొత్తం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో అనుమానం వచ్చి సత్యారావు గుర్ల పోలీసుల ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన గుర్ల పోలీసులు వెంటనే సైబర్‌ పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. సైబర్‌ స్టేషన్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌, విజయనగరం రూరల్‌ స్టేషన్‌ ఎస్‌ఐ పి.నారాయణరావు, సీఐ మంగవేణి ఆధ్వర్యం లో కేసు దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేసిన ఖాతాల ద్వారా బిహార్‌ రాష్ట్రం పాట్నా సిటీ సమీపంలోని ఽధనాపూర్‌గా లోకేషన్‌ గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో ఈ డిజిటల్‌ ఇండియా బ్యాంకు కస్టమర్‌ సర్వీసు ప్రతినిధులను ఆదుపులోకి తీసుకుని, సదరు అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేసి నగదుతో పా టు ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్‌ ఉపయోగించిన 20 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  

 

Updated Date - 2021-12-01T05:22:44+05:30 IST