ఆడిట్‌ రిజిస్ట్రార్‌ రికార్డుల తనిఖీ

ABN , First Publish Date - 2021-02-28T05:23:23+05:30 IST

కొవ్వూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌ పి.రామలక్ష్మి పట్నాయక్‌ రికార్డులు తనిఖీ చేశారు.

ఆడిట్‌ రిజిస్ట్రార్‌ రికార్డుల తనిఖీ

కొవ్వూరు, ఫిబ్రవరి 27: కొవ్వూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌ పి.రామలక్ష్మి పట్నాయక్‌  రికార్డులు తనిఖీ చేశారు. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయ తలుపులు మూసివేసి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌  శ్రీనివాసబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T05:23:23+05:30 IST