ఉన్నత విద్యకు దూరం

ABN , First Publish Date - 2022-08-08T05:07:10+05:30 IST

అయిజ మునిసిపాలిటీ పరిధి లో డిగ్రీ కళాశాల లేక బాలికలు ఉన్నత విద్యకు దూ రమవుతున్నారు.

ఉన్నత విద్యకు దూరం
డిగ్రీ కళాశాల స్థలం

 - ఇంటర్‌తోనే చదువు మానేస్తున్న విద్యార్థినులు

- అయిజలో డిగ్రీ కళాశాల లేక ఇబ్బందులు

- ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం

అయిజ, ఆగస్టు 7 : అయిజ మునిసిపాలిటీ పరిధి లో డిగ్రీ కళాశాల లేక బాలికలు ఉన్నత విద్యకు దూ రమవుతున్నారు. జిల్లా కేంద్రమైన గద్వాల తర్వాత స్థానంలో అన్ని రంగాల్లో అయిజ మునిసిపాలిటీ ముందుంది. కానీ డిగ్రీ కళాశాల లేకపోవడం సమస్య గా మారింది. ఇంటర్‌ పూర్తయిన తర్వాత ఉన్నత వి ద్యకోసం దూర ప్రాంతాలకు పంపించేందుకు కొం దరు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అందుకు అ వసరమైన ఆర్థికస్థోమత లేకపోవడం మరో కార ణమని చెప్పవచ్చు. 

జిల్లా కేంద్రానికి రావాల్సిందే...

అయిజ మునిసిపాలిటీ, మండల పరిధిలో 2011 లెక్కల ప్రకారం 85,972 మంది జనాభా ఉంది. ప్రస్తు తం ఆ సంఖ్య లక్షకు చేరి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయిజలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కస్తూర్బా విద్యాలయం ఉన్నాయి. వీటితో పాటు నాలుగు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, ఒక ఐటీఐ, రెండు ఓపెన్‌ ఇంటర్‌ కళాశాలలున్నాయి. అయిజ నుంచి శాంతినగర్‌ 20 కిలోమీటర్లు, గద్వాల 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయిజ మండలం లో 28 గ్రామపంచాయితీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ కళాశాల పక్కనే మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. పైగా అయిజ పక్కనే మల్దకల్‌, గట్టు, రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన గ్రామాలున్నాయి. ఈ నేపథ్యంలో అయిజ, గట్టు మండలాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ చదవాలంటే ప్రతీ రోజు రాను పోను దాదాపు 60 కిలోమీటర్లు ప్ర యాణించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చాలామంది విద్యార్థినులు ఇంటర్‌తోనే చదువుకు స్వ స్తి పలుకుతున్నారు.ఈ నేపథ్యంలో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న అయిజలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విదార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

డిగ్రీ కళాశాల కోసం విద్యార్థుల ఆందోళన

అయిజలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వివి ధ పార్టీలు, విద్యా ర్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అందుకు అ నుగుణంగా పలుమా ర్లు ఆందోళనలు కూడా చేపట్టారు. అయినా పాలకులు స్పందించ డం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పా టుకు అవసరమై న స్థలం అందుబాటులో ఉన్నా స్థానిక ప్రజాప్ర తినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. గత నెల్లో కూడా ఇంటర్‌ విద్యార్థులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మద్దతుతో అయిజలో మానవహారం, రాస్తారో కో చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

సమయం వృథా అవుతోంది

అయిజలో డిగ్రీ కళాశాల లేకనే గద్వాలకు బస్సు పాసుతో  బస్సులో ప్రయాణించి డిగ్రీ చదవాల్సి వస్తోంది. రావటం, పోవటంతోనే సమయం వృథా అవుతోంది. ప్రయాణంలో  చేసి చదవటం కష్టంగా మారితోంది. ఇంటి పని సైతం చేసుకోలేని విధంగా అలసట, నీరసంగా ఉంటుంది.  పైగా ఖర్చుతో కూడుకున్నది. అయిజలో కళాశాల ఏర్పాటు చేస్తే బాలికలకు బాగుంటుంది. 

- భాగ్యవతి, డిగ్రీ విద్యార్థిని, ఎంఏఎల్‌డీ కళాశాల, గద్వాల 

 పై చదువులకు దూరం అవుతానేమో

అయిజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఉన్నత చదువులైన డిగ్రీ కోసం శాంతినగర్‌, గద్వాలకు రోజు వెళ్ళి చదువుకోవాలంటే కష్టం అంటున్నారు. పైగా పంపించటానికి మా తల్లిదండ్రులు సైతం ఆలోచిస్తున్నారు. ఇంటర్‌తోనే నా చదువు ఆగిపోయ్యే అవకాశం ఉంది.   నాలాంటి వారు పై చదువులకు దూరం కాకుండా ఉండాలంటే అయిజలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.

- తులసీ, ఇంటర్‌, అయిజ

Updated Date - 2022-08-08T05:07:10+05:30 IST