Madras High Court: రోడ్డు ప్రమాదం చేసిన డ్రైవరుకు హైకోర్టు సంచలన శిక్ష

ABN , First Publish Date - 2022-09-14T18:18:19+05:30 IST

పీకల దాకా మద్యం తాగి కారు నడిపి ముగ్గురు పాదచారులను గాయపర్చిన డ్రైవరుకు(Driver) మద్రాస్ హైకోర్టు(Madras High Court) సంచలన శిక్ష....

Madras High Court: రోడ్డు ప్రమాదం చేసిన డ్రైవరుకు హైకోర్టు సంచలన శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవింగుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచండి...

చెన్నై(తమిళనాడు): పీకల దాకా మద్యం తాగి కారు నడిపి ముగ్గురు పాదచారులను గాయపర్చిన డ్రైవరుకు(Driver) మద్రాస్ హైకోర్టు(Madras High Court) సంచలన శిక్ష విధించింది.(Court order To Driver) మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురి గాయాలకు కారణమైన డ్రైవరుకు మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఏడీ జగదీష్ చంద్ర బెయిలు మంజూరు చేయడంతోపాటు సంచలన ఆదేశాలు జారీ చేశారు.(Distribute Pamphlets) డ్రంక్ అండ్ డ్రైవింగుకు(Drunk Driving) వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి వాటిని రెండు వారాల పాటు సిటీ బిజీ జంక్షనులో వాహనచోదకులకు పంచి పెట్టాలని జడ్జి జగదీష్ చంద్ర ఆదేశించారు. 


రోడ్డు ప్రమాదం చేసిన డ్రైవరు 25వేల రూపాయల ఇద్దరి పూచీకత్తుపై బెయిలు ఇస్తూ కరపత్రాలను ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు వాహనచోదకులకు పంచాలని జడ్జి సూచించారు.రెండు వారాల పాటు డ్రంక్ అండ్ డ్రైవింగుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశాక నిందితుడైన డ్రైవరు అడయార్ పోలీసుల ముందు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. 


Updated Date - 2022-09-14T18:18:19+05:30 IST