వృద్ధులకు దుప్పట్లు, చీరల పంపిణీ

ABN , First Publish Date - 2020-11-30T04:45:36+05:30 IST

స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాలులో ఆదివారం వైజేపీ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బాబురావు దాతృత్వంతో వృద్ధులు, మహిళలకు దుప్పట్లు, చీరలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు.

వృద్ధులకు దుప్పట్లు, చీరల పంపిణీ
దుప్పట్లు, భోజనం అందజేస్తున్న వైజేపీ లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు

గూడూరు(రూరల్‌), నవంబరు 29:స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీ హాలులో ఆదివారం వైజేపీ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బాబురావు దాతృత్వంతో వృద్ధులు, మహిళలకు  దుప్పట్లు, చీరలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. నవీన్‌జయకుమార్‌, బాబురావు, రమణయ్య, సుధాకర్‌, శివరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోట : కోట పట్టణ పరిధిలోని నార్త్‌ గిరిజన కాలనీలో జిలానీ బాషా దాతృత్వంతో గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ జలీల్‌ అహ్మద్‌  150 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.  ఫౌండేషన్‌ ప్రతినిఽధులు నౌషాద్‌ బాషా, ఇలియాజ్‌, షంషుద్దీన్‌, తాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

వాకాడు:  తిరుమూరు గ్రామంలో 100 గిరిజన కుటుంబాలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య ఆదివారం దుప్పట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.  పెళ్ళూరు కోటేశ్వరరెడ్డి, పెళ్ళూరు వెంకటరమణారెడ్డి, బాలయ్య, సులోచనమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T04:45:36+05:30 IST