రుయాకు 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ

ABN , First Publish Date - 2021-06-24T06:23:11+05:30 IST

కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను (5 లీటర్లు) బుధవారం రుయాస్పత్రికి యాక్షన్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ వితరణగా అందించింది.

రుయాకు 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ
సూపరింటెండెంట్‌ భారతికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందిస్తున్న రాజశేఖర్‌

తిరుపతి సిటీ, జూన్‌ 23: కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను (5 లీటర్లు) బుధవారం రుయాస్పత్రికి యాక్షన్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ వితరణగా అందించింది. రూ.35 లక్షల విలువైన వీటిని రుయా సూపరింటెండెంట్‌ భారతికి ఆ అసోసియేషన్‌ పీవో రాజశేఖర్‌ అందజేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు పెంచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గివ్‌ ఇండియా ఆర్థిక సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాలకు 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 100.. 5 లీటర్ల సామర్థ్యం కలిగిన 300 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను పంపిణీ చేశామని వివరించారు. రుయాలో వైద్య పరికరాల కొరత ఉందని తెలిసి వీటిని అందించామన్నారు. దాతలు ముందుకు వచ్చి మరింత చేయూతను అందిస్తే కొవిడ్‌ నిర్మూలన దిశగా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని సూపరింటెండెంట్‌ భారతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌, దాతలతోపాటు బిల్డర్‌ ప్రభాకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T06:23:11+05:30 IST