విద్యాసంస్థలకు సర్టిఫికెట్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-03-09T04:56:13+05:30 IST

అనేక సేవా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాసంస్థలకు రెడ్‌క్రాస్‌ సంస్థ మంజూరు చేసిన సర్టిఫికెట్లను కలెక్టర్‌ హరికిరణ్‌ అందజేశారు.

విద్యాసంస్థలకు సర్టిఫికెట్లు పంపిణీ
సర్టిఫికెట్లను అందజేస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), మార్చి 8: అనేక సేవా కార్యక్రమాల్లో ఉత్తమ  ప్రతిభ కనబర్చిన విద్యాసంస్థలకు రెడ్‌క్రాస్‌ సంస్థ మంజూరు చేసిన సర్టిఫికెట్లను కలెక్టర్‌ హరికిరణ్‌ అందజేశారు. జిల్లాలోని 6 విద్యా సంస్థలకు ఈ సర్టిఫికెట్లు దక్కాయి. వీటికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర చైర్మన్‌, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ సంతకాలతో కూడిన బంగారు, వెండి, రజిత సేవాపత్రాలను కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ జూనియర్‌ రెడ్‌క్రాస్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ అనే రెండు విభాగాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులతో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ప్రతిభ చూపిన కళాశాలలకు, హైస్కూల్స్‌కు సర్టిఫి కెట్లను ప్రదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పిచ్చయ్యచౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T04:56:13+05:30 IST