అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు పంపిణీ

ABN , First Publish Date - 2021-07-30T05:46:27+05:30 IST

జిల్లాలో అర్హులందరికీ ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ గు గులోతు రవి అన్నారు.

అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు పంపిణీ
ధర్మపురిలో ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ గుగులోతు రవి

ధర్మపురి, జూలై 29: జిల్లాలో అర్హులందరికీ ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ గు గులోతు రవి అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్‌ గార్డెన్స్‌లో చేపట్టిన ఆహార భద్రత కార్డుల పం పిణీ కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులను గుర్తించి, ఈ నెల లోపుగా కార్డుల పంపిణీ కార్య క్రమాన్ని పూర్తి చేసి, ఆగస్టు మొదటి వారం నుంచి నిత్యావసర సరుకులు కూడ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్‌ కార్డులు పంపిణీ చేయడం ద్వారా కొత్తగా 7621 కుటుంబాలకు లబ్దిచేకూరుతుండగా, ధర్మపురి మండలంలో 385 కార్డులను కొత్తగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అర్హత కలిగి దరఖాస్తులు చేసుకోలేని, తిరస్కరించబడిన వారు కొత్త రేషన్‌ కార్డులు పొందే అవకాశాన్ని తిరిగి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్‌ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందించామన్నారు. ఈ కార్డుల ద్వారా అన్ని పథకాలకు అర్హులవుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, తహసీల్దార్‌ రవిందర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ సునీ ల్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రామయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు మొగిలి శేఖర్‌, జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యులు సయ్యద్‌ ఆసిఫ్‌, ఎండీ షబ్బీర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:46:27+05:30 IST