AP News: చంద్రగిరిలో లక్షా 24 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-26T02:41:24+05:30 IST

Tirupati: పర్యావరణ హితమే ధ్యేయంగా చంద్రగిరిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాలలో.. 7

AP News:  చంద్రగిరిలో లక్షా 24 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Tirupati: పర్యావరణ హితమే ధ్యేయంగా చంద్రగిరిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాలలో.. 7 వందల మంది గడిచిన 25 రోజులుగా విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు.  విగ్రహాల తయారీకి సుమారు 2,500 టన్నుల బంకమట్టి తెప్పించారు. విగ్రహంతో పాటు గణపతి పూజ విధానాన్ని వివరించే పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు. 2 వేల మంది వలంటీర్లు ఇంటింటికి తిరిగి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2022-08-26T02:41:24+05:30 IST