రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-09T04:19:13+05:30 IST

ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు మాస్కులు, సబ్బులను పంపిణీ చేశారు.

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

నారాయణపేట టౌన్‌, మే 8 : ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు మాస్కులు, సబ్బులను పంపిణీ చేశారు. కలెక్టర్‌ హరిచందన ఆదేశాల మేరకు కరోనా కష్ట కాలంలో గతేడాది పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వారు గుర్తు చేశారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్‌ హరిచందన, ఉపాధ్యక్షునిగా అదనపు కలెక్టర్‌ కొన సాగుతున్నారని, వారి ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ కన్వీనర్‌ సుదర్శన్‌రెడ్డి, సభ్యులు హరి నారాయణ భట్టడ్‌, గందె చంద్రకాంత్‌, కృష్ణభగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:19:13+05:30 IST