ఎప్పుడొస్తుందో..ఎక్కడుంటుందో!

May 10 2021 @ 22:54PM
సీతంపేట మండలం ఈతమానుగూడలో వాహనం వద్ద గుమిగూడిన జనం

- ఎండీయూ వాహనాల కోసం ఎదురుచూపు
- జిల్లాలో నత్తనడకన రేషన్‌ పంపిణీ
- గిరిజన గ్రామాల్లో కానరాని వాహన సేవలు
- నెట్‌వర్క్‌ లేక ఇబ్బందులు

(మెళియాపుట్టి/ ఇచ్ఛాపురం రూరల్‌/ సీతంపేట)

జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీ నత్తనడకన సాగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో బియ్యం పంపిణీ వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కరోనా దృష్ట్యా కొంతమంది వాహన ఆపరేటర్లు విధులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాహనాలు ఎప్పుడు వస్తున్నాయో.. నిత్యావసర సరుకులు ఎప్పుడు పంపిణీ చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో డీలర్లే బాధ్యత వహించి రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. కానీ, ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. మరోవైపు నెట్‌వర్క్‌ సమస్య కారణంగా గిరిజన గ్రామాల్లో వాహన సేవలు కానరావడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.


 జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో జిల్లాలో 2,015 చౌకధరల దుకాణాల పరిధిలో 8.09 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు 530 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహ నాలను సమకూర్చింది. ఈ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. ఒక్కో వాహనానికి రెండు సచి వాలయాలు చొప్పున కేటాయించారు. రోజుకు ఒక్కో వాహనం ద్వారా 90 మందికి చొప్పున ప్రతినెలా 20వ తేదీలోగా రేషన్‌ పంపిణీ పూర్తి చేయాలి. కానీ, ఈ పది రోజుల్లో 45 శాతం మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని చోట్ల ఎండీ యూ వాహన నిర్వాహకులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో వీఆర్వో లాగిన్‌లో రేషన్‌ పంపిణీ చేస్తున్నా, సకాలంలో లక్ష్యాలు చేరుకోలేకపోతు న్నారు. రేషన్‌ పంపిణీ గురించి రెవె న్యూ సిబ్బంది, వలంటీర్లు సమా చారం ఇవ్వడం లేదని, దీంతో వాహనం కోసం నిత్యం ఎదురుచూడాల్సి వస్తోందని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వచ్చినా.. సర్వర్లు మొరాయి స్తుండడంతో రోజంతా నిరీక్షణ తప్పడం లేదని వాపోతున్నారు. ఈ నెల కేంద్ర ప్రభుత్వం కూడా ఆహార భద్రతా పథ కం కింద ఉండే కార్డులకు ఐదేసి కేజీలు చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణ యించింది. ఆ బియ్యం కూడా తామే పంపిణీ చేయడంతో కాస్త ఆల స్యమవు తోందని వాహన నిర్వాహకులు చెబుతున్నారు.


సాంకేతిక సమస్యలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలి. కానీ, వీధి చివరన వాహనం నిలిపి సరుకులు పంపిణీ చేస్తు న్నారు. మెళియాపుట్టి, సీతంపేట తదితర మండలాల్లోని కొన్ని గిరిజన గ్రా మాల్లో, కొండ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్య కారణంగా వాహన సేవలు అం దడం లేదు. సిగ్నల్స్‌ ఉన్న దగ్గర రెండు, మూడు గ్రామాలకు ఒకే చోట పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కొవిడ్‌ నిబంధనలు ఉల్ల ంఘిస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా రేష న్‌ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందే అవకా శం ఉందని మరికొందరు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పంది ంచి సకాలంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


25 వరకు పంపిణీ చేస్తాం

ఉచిత రేషన్‌ పంపిణీ ఈనెల 25వరకు సాగుతుంది. కొన్నిచోట్ల వాహన ఆపరేటర్లతో ఇబ్బందులు వచ్చినా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వారు అందుబాటులో ఉన్నారు. సర్వర్లలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ వేగంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

-డి.వెంకటరమణ, డీఎస్‌వో, శ్రీకాకుళంFollow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.