Advertisement

1,209 మంది ప్రైవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ

Apr 22 2021 @ 23:32PM
వెల్దుర్తిలో ఓ ప్రైవేట్‌ టీచర్‌కు బియ్యం అందజేస్తున్న డీఈవో రమేశ్‌కుమార్‌

మెదక్‌ జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌

వెల్దుర్తి ఏప్రిల్‌ 22:  మెదక్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూతబడ్డ ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 1,209 ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం, రెండు వేల నగదును పంపిణీ చేసినట్లు డీఈవో రమేశ్‌కుమార్‌  తెలిపారు. గురువారం వెల్దుర్తిలోని ఓ రేషన్‌ దుకాణంలో ప్రైవే టు పాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యం పంపి  ణీ చేశారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 111 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండ గా, నగదు, బియ్యం పంపిణీ కోసం రెండు వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా మొదటి విడుతగా 1,209 ఉపాధ్యాయులకు  నగ దు, బియ్యా న్ని పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సురేశ్‌కుమార్‌, ఎంఈవో యాదగిరి, ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య పాల్గొన్నారు.

నాగల్‌గిద్దలో నలుగురికి

నాగల్‌గిద్ద, ఏప్రిల్‌ 22:  మండల కేంద్రమైన నాగల్‌గిద్దలో గురువారం రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ఆధ్వర్యంలో నలుగురు ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్‌ కుశాల్‌ రావు, రాజు, రవి పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement