దాసార్లపల్లెలో నాసిరకం కోడిగుడ్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-07-06T06:00:20+05:30 IST

తమకు దాసార్లపల్లె అంగన్‌వాడీ కేంద్రలో కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేసినట్లు గర్భిణులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు.

దాసార్లపల్లెలో నాసిరకం కోడిగుడ్ల పంపిణీ

వి.కోట, జూలై 5: తమకు దాసార్లపల్లె అంగన్‌వాడీ కేంద్రలో కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేసినట్లు గర్భిణులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 21, 22 తేదీల్లో వచ్చిన కోడిగుడ్లను కేంద్రం పరిధిలోని 30మంది గర్భి ణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పంపిణీ చేశారు. ఆ గుడ్లను 4వ తేదిన ప్రియదర్శిని అనే గర్భిణి ఉడికించగా కుళ్లిన వాసన రావడంతో కేంద్రం నిర్వాహ కురాలి దృష్టికి తీసుకెళ్లింది. అలాగే మరో 25 మంది గర్భిణులు, బాలింతలు ఫి ర్యాదు చేశారు. ఒకోక్కరికి 25 గుడ్లు ఇవ్వగా అందులో కొన్ని గుడ్లు చెడి పోయాయి. సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో రాజేశ్వరి, సూపర్‌ వైజర్‌ శారద గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంపిణీదారు ఇచ్చిన గుడ్లను అందించామని అందులో కొన్ని చెడిపోయినట్లు  వివరణ ఇచ్చారు. 

Updated Date - 2022-07-06T06:00:20+05:30 IST