ఏడాదిగా నిలిచిన విటమిన్‌ ఎ ద్రావణం పంపిణీ

ABN , First Publish Date - 2022-01-22T05:03:46+05:30 IST

పిల్లలు ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. క్రమం తప్పకుం డా అందించాల్సిన వ్యాక్సిన్‌, విటమిన్‌ ఎ ద్రావ ణం సరఫరాను నిలిపివేసింది. దీంతో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది.

ఏడాదిగా నిలిచిన విటమిన్‌ ఎ ద్రావణం పంపిణీ

చిన్నారుల కంటిచూపుపై ప్రభావం 

తల్లిదండ్రుల ఆందోళన 


మద్దిపాడు, జనవరి 21 : పిల్లలు ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. క్రమం తప్పకుం డా అందించాల్సిన వ్యాక్సిన్‌, విటమిన్‌ ఎ ద్రావ ణం సరఫరాను నిలిపివేసింది. దీంతో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది. పిల్లలకు భ విష్యత్‌లో కంటిచూపు సమస్యలు రాకూడదనే ఉ ద్దేశంతో 6 నెలలకు ఒకసారి ఉచితంగా విటమిన్‌ ఎ ద్రావణం సరఫరా చేసేవారు. గత ఏడాది కా లంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఐదేళ్లులో పు చిన్నారులకు ద్రావణం విధిగా అందించాలి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మద్దిపాడు మం డలంలో సుమారు 344 అంగన్‌ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఐదేళ్ళలోపు పిల్లలు కనీసం 40వేల మంది నమోదై ఉన్నారు. వీరంతా విటమిన్‌ ఎ ద్రావణం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై త ల్లిదండ్రులు ప్రశ్నిస్తుండడంతో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నతా ధికారులను అడుగుతుంటే రాష్ట్రస్థాయిలో కొరత ఉందని చెబుతున్నారు. 9నెలల నుంచి ఐదేళ్ళలో పు చిన్నారులకు ఒక డోసు వేసిన తరువాత మరో ఆరు నెలలకు రెండవ డోసు వేయాలి. ఇలా ఐ దేళ్ల వరకు కొనసాగించాలి. లేదంటే చినారులకు భవిష్యత్‌లో కంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరంలో విటమెన్‌ ఎ లోపిస్తే ఎముకలు సరిగా పెరగవు. బలహీనంగా మారుతాయి. మూత్రాశం లో ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి బలహీనం అవుతుంది. చర్మ పొ డిబారి పోతుంది. కంటి చూపు మందగిస్తుంది. తరువాత సుక్లాలు సమస్యలు తలెత్తుతాయి. ఇం తటి కీలకమైన విటమిన్‌ ఎ ద్రావణం సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోది. ఇ ప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విటమిన్‌ ఎ ద్రావణాన్ని సరఫరా చేయాలని చిన్నారుల త ల్లిదండ్రులు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-22T05:03:46+05:30 IST